60 ఏళ్ల ముసలోడితో ఎఫైర్, అలాంటి మగాడు దొరకడంటూ.. నాగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
గ్లామర్ ఫీల్డ్ అయిన ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్ల గురించి రకరకాల గాసిప్స్ వస్తుంటాయి. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఇది కామన్ అన్నట్లుగా పరిస్ధితులు తయారయ్యాయి. ఆడా మగా కాస్త చనువుగా ఉన్నా చాలు లేనిపోనివి అంటకట్టి వారి పరువును నడిబజారులో తీయడానికి కొందరు రెడీగా ఉంటారు. వీటిని చూసి చూడనట్లుగా వదిలేసే స్టార్స్ కొందరైతే, అంతు చూసే వరకు విడిచిపెట్టని వారు ఉన్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ తనపై వచ్చిన పుకార్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఎలాంటి సబ్జెక్ట్‌పై అయినా ఉన్నది ఉన్నట్లు కుండబద్ధలు కొట్టే వారిలో కస్తూరి ముందు వరుసలో ఉంటారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు ఈవిడ పెట్టింది పేరు. 1991లో ఆతా ఉన్ కోయిలే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. మూడున్నర దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. నిప్పు రవ్వ, గాడ్ ఫాదర్, సొగ్గాడి పెళ్లాం, మెరుపు, చిలక్కొట్టుడు, అన్నమయ్య, మా ఆయన బంగారం, ఆకాశ వీధిలో, డాన్ శీను, శమంతకమణి, సింబా వంటి సినిమాలతో తెలుగువారిని పలకరించారు.

కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే రవికుమార్ అనే వ్యక్తిని పెళ్లాడారు కస్తూరి. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ఆమె అనంతరం సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశారు. అమ్మ, అక్క, వదిన వంటి పాత్రలు వేస్తూ బిజీ అయ్యారు. బుల్లితెరపైనా ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సీరియల్స్, షోలు చేశారు. స్టార్ మాలో ప్రసారమైన ఇంటింటి గృహలక్ష్మీ ధారావాహిక ద్వారా తెలుగు లొగిళ్లకు కస్తూరి మరింత చేరువయ్యారు. తన నటనతో ఆ సీరియల్‌ని టాప్‌లో నిలబెట్టారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కస్తూరి శంకర్.. 50 ప్లస్‌లోనూ హాట్ హాట్ డ్రెస్స్‌ల్లో అందాల ఆరబోత చేస్తుంటారు. సినిమాలతో పాటు ప్రతీ విషయంలోనూ స్పందించే ఆమె ఆడవారి హక్కుల విషయంలో మాత్రం సీరియస్‌గా ఉంటారు. మీటూ ఉద్యమం ఉద్ధృతంగా సాగిన సమయంలో కస్తూరి హాట్ కామెంట్స్ చేశారు. తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభాలు చాలానే ఉన్నాయని.. అన్ని ఇండస్ట్రీలలో దీనిని ఎదుర్కొన్నాని చెప్పారు. మొన్నామధ్య హీరోయిన్ల గురించి అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత చేసిన కామెంట్స్‌పై కడిగిపారేశారు.

తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లలో తనపై వచ్చిన భయంకరమైన రూమర్ గురించి చెప్పారు. తాను తమిళనాడుకు చెందిన ఓ 60 ఏళ్ల ముసలాయనతో ఎఫైర్ పెట్టుకున్నానని, ఆయన తనకు లండన్‌లో ఇల్లు కొనిపెట్టాడని పుకార్లు హల్‌చల్ చేశాయని వెల్లడించారు. దీంతో తాను చాలా బాధపడ్డానని, బయటికి వెళ్లాలన్నా భయం వేసేదని .. తన తండ్రి మాత్రం నువ్వు ఇంట్లోనే ఉంటే వాళ్లు గెలిచినట్లేనని , బయటికెళ్లి ధైర్యంగా నిలబడాలని మోటివేట్ చేశారని కస్తూరి పేర్కొన్నారు.
అలాంటి ఒక మగాడు ఎక్కడ దొరుకుతాడు, ఒక భర్తగా, తండ్రిగా ఆయన మాకు అండగా నిలిచారని ఆమె ప్రశంసించారు. అయితే తన తల్లి మాత్రం ఆ గాసిప్ వచ్చాక భయపడ్డారని, వెంటనే సంబంధాలు వెతకడం మొదలుపెట్టి రెండేళ్లు తిరిగేసరికి నాకు పెళ్లి చేసేశారని కస్తూరి గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కస్తూరితో ఎఫైర్ అంటగట్టిన ఆ 60 ఏళ్ల బిజినెస్‌మెన్ ఎవరు అంటూ ప్రచారం నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











