Kathanar Trailer Review: కథనార్ మూవీ ట్రైలర్ రివ్యూ.. అనుష్క శెట్టి మాయాజాలం

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం కథనార్. కేరళ సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాత గోకులం గోపాలన్ సొంత బ్యానర్‌పై శ్రీ గోకులం మూవీస్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ హీరో జయసూర్య, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా సనూప్ సాన్, శాండీ, దేవిక, నితీష్ భరద్వాజ్, వినీత్, హరీష్ ఉత్తమన్, శ్రీకాంత్ మురళి, కులప్రీత్ యాదవ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సహ నిర్మాతలు - బైజు గోపాలన్, వీసీ ప్రవీణ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కృష్ణమూర్తి, రచన: ఆర్ రామానంద్ & రోజిన్ థామస్, సినిమాటోగ్రఫి: నీల్ డి కున్హా, ఒరిజినల్ స్కోర్, పాటలు: రాహుల్ సుబ్రహ్మణ్యన్, ఎడిటర్ & Vfx డైరెక్టర్ - రోజిన్ థామస్ తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల మందుకు రానున్నది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? మలయాళ ఎంట్రీతో అనుష్క శెట్టి కెరీర్ మళ్లీ పీక్స్‌కు వెళ్తుందా? అనే వివరాల్లోకి వెళితే..

Kathanar The Wild Sorcerer Trailer Review

సినిమా రంగానికి కొంతకాలంగా దూరంగా ఉంటున్న అనుష్క శెట్టి ప్రస్తుతం పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న హీరోయిన్ సెంట్రీక్ మూవీస్‌లోనే నటిస్తున్నది. ఈ క్రమంలోనే కథాబలం, హీరోయిన్ పాత్రకు అత్యంత ప్రాధాన్యం ఉన్న సినిమా కథనార్‌ ద్వారా మలయాళంలో ఎంట్రీకి రెడీ అయ్యారు. ఈ చిత్రంలో కల్లియాణకట్టు నీలీ అనే యక్షిణి పాత్రలో నటించారు. ట్రైలర్ విషయానికి వస్తే.. అనుష్క శెట్టి పాత్రను పెద్దగా రివీల్ చేయకుండా క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేశారు. కానీ ఈ కథలో బలమైన పాత్ర అనే విషయాన్ని ట్రైలర్ ద్వారా రిజిస్టర్ చేశారు.

విజ్ఞానం రూపం మూలం ఎలా ఉన్నా కూడా.. కాంతూర్ శాలయలో దాన్ని ఆహ్వానిస్తారు అంటూ ట్రైలర్ మొదలైంది. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించారనే విషయం విజువల్స్ స్పష్టం చేశాయి. ఇంద్రజాలాన్ని నేను నమ్మను.. అవగాహనతో రహస్య మార్గాలలో వాళ్లు దాన్ని పరిశోధిస్తున్నారు.. ఎవరి ఊహకి అందని.. అందరూ ఆశ్చర్యంతో చూసే ఒక మాయా జాలం.. మన ఆత్మతో కలిసి మన జ్ఞాపకాలతో ఐక్యం కాబోయే ఒక సంఘటన అంటూ ఈ చిత్రం పిరియాడిక్ మూవీ అనే చెప్పకనే చెప్పారు.

చేర మహారాజుకి కుంచమున్ తరుపున శుభాకాంక్షలు'.. 'చూసినది విన్నది ఏదీ రాదు.. వచ్చేది ఒక్కటే.. ఆపత్కాలంలో వచ్చే మహా మనిషి అగ్ని ఒక్కటే'.. 'కరం కలిస్తే ఆప్యాయిత.. కరం వెడిస్తే నాశనమే బలం'.. 'ఒక శరీరాన్ని అదుపు చేసే ఎక్కువ శక్తిని మీరు నియంత్రించగలిగారు.. ఎలాగా?'.. 'మేం చెప్పేది నమ్మండి. వేనాడు ఆపదలో ఉంది'.. 'మాయ.. ప్రపంచమే మాయ' అంటూ ట్రైలర్‌ను ముగించారు. అయితే ఈ సినిమా చారిత్రక నేపథ్యం ఉన్న సోషల్ డ్రామాగా తెరకెక్కిందనే విషయాన్ని చూఛాయగా వెల్లడించే ప్రయత్నం చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఈ సినిమా శ్రీ గోకులం మూవీస్‌పై రూపొందుతుండటంతో భారీ స్కేల్‌లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

కథనార్ చిత్రంలో జయసూర్య, ప్రభుదేవా పాత్రలు గంభీరంగా, ఇంటెన్స్ లుక్‌తో కనిపించాయి. వారి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలెట్ అవుతుందనే విషయం వారి పాత్రల ద్వారా స్పష్టమైంది. ఇక సాంకేతికంగా కూడా ఈ మూవీ రిచ్‌గా ఉంది. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్ హై క్లాస్‌లో ఉంది. విజువల్స్ బ్యూటీ చాలా అద్బుతంగా ఉందనే ఫీలింగ్‌ను మాత్రం ట్రైలర్ ద్వారా క్రియేట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X