twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కత్తి మహేష్ మైనింగ్ బిజినెస్ డీల్.. ఆ అధికారి రమ్మనడంతోనే వెళ్తూ?

    |

    రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కత్తి మహేష్ మృతి ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయని మంద కృష్ణ మాదిగ సహా కత్తి మహేష్ తండ్రి పేర్కొనడంతో కత్తి మహేష్ మృతిపై విచారణ జరపడానికి సిద్ధమని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వైద్యం కోసం ప్రభుత్వం 17 లక్షలు ఇచ్చినట్టే ఆయన కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సినీ నటుడు, దర్శకుడు కత్తి మహేష్ మృతిపై అనుమానాలు ఉంటే విచారణ జరపడానికి సిద్ధమని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

    కత్తి మహేష్ దళిత జాతిలో ఉన్నత స్థితికి ఎదిగిన వ్యక్తన్న ఆయన కత్తి మహేష్ వైఎస్సార్ పార్టీ సానుభూతిపరుడని, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారంలో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని దళిత సంఘాల నేతలు ప్రకటనపై స్పందించిన మంత్రి సురేష్ ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణ జరపడానికి సిద్ధమని అన్నారు. ఈ విషయం పక్కన పెడితే అసలు యాక్సిడెంట్ అయిన సమయంలో కత్తితో ఉన్న సురేష్ ఎవరు? కత్తి మహేష్‌కి ఇతనికి సంబంధం ఏంటి? ఇద్దరూ ఎందుకు చిత్తూరు వెళుతున్నారు.

    Kathi Mahesh Business plans with Suresh revealed

    అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయనను నిన్న పోలీసులు విచారించారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన కత్తి మహేష్ బిజినెస్ పార్టనర్ అని, ఇద్దరం కలిసి మైనింగ్ వ్యాపారం చేయాలని అనుకున్నారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా ఉదయ మాణిక్యం గ్రామంలో మైనింగ్ చేద్దాం అని అనుకున్నామని వెల్లడించారు. దానికి సంబంధించిన ఎన్ఓసీ కోసం ఎమ్మార్వో ఆఫీస్ నుంచి పిలుపు వచ్చిందని అన్నారు. ఎన్ఓసీ రావాలంటే గ్రామ సభ పెట్టాలి.. ఆ గ్రామ సభ కోసం ఎంపీడీవో గారు మమ్మల్ని పిలిచారు. గ్రామ సభ కోసం మేం ఆ రాత్రి మేం వెళ్లామని ఆయన వెల్లడించారు.

    English summary
    Actor and film critic Kathi Mahesh passed away in a Chennai hospital recently. The 44-year-old actor succumbed to injuries he suffered in an accident in Andhra Pradesh’s Nellore on June 26.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X