twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RIP kathi Mahesh : ఆ కోరికలు తీరకుండానే కన్నుమూసిన కత్తి మహేష్!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలపాలై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ కొద్ది సేపటి క్రితం మృతి చెందినట్లు సమాచారం. అయితే ఆయనకి రెండు బలమైన కోరికలు ఉండేవని, ఆ కోరికలు తీరకుండానే ఆయన కన్నుమూశారని అంటున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    నెల్లూరులో రోడ్డు ప్రమాదం

    నెల్లూరులో రోడ్డు ప్రమాదం


    ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం గురించి ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. నిజానికి విజయవాడ నుంచి స్వస్థలం పీలేరు వెళుతున్న కత్తి మహేష్ కారు రోడ్డు ప్రమాదానికి గురయింది. ఎదురుగా వెళ్తున్న ఒక లారీని అనుకోకుండా ఢీకొనడంతో ఆయన ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.

    ఏపీ సర్కార్ సాయం

    ఏపీ సర్కార్ సాయం

    ముందు నెల్లూరులో ఉన్న మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. అయితే ఆయన కళ్ళు పూర్తిగా దెబ్బతినడంతో ముందుగా శస్త్రచికిత్స చేసి అప్పటికప్పుడు ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడే మహేష్ కు గత కొద్ది రోజులుగా చికిత్స జరుగుతుంది. ఇప్పటి వరకు హాస్పిటల్ బిల్లులు అన్నీ మహేష్ కత్తి కుటుంబమే భరిస్తూ వచ్చినా ఏపీ ప్రభుత్వం కత్తి మహేష్ హాస్పిటల్ ఖర్చుల కోసం ఏకంగా 17 లక్షలు విడుదల చేసింది.

    రెండు బలమైన కోరికలు

    రెండు బలమైన కోరికలు

    ఆ సంగతి పక్కన పెడితే నిజానికి కత్తి మహేష్ కి రెండు బలమైన కోరికలు ఉండేవట. అందులో ఒకటి రాజకీయాలలో రాణించడం కాగా మరొకటి సినిమాల్లో నటుడిగా రాణించడం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల నుంచే ఆయన రాజకీయాల మీద స్పష్టమైన అవగాహన కలిగి ఉండేవారు.. ఎప్పటికైనా రాజకీయాల్లో ఎంటర్ అయి ప్రజలకు సేవ చేయాలని ఆయన భావిస్తూ ఉండే వారు. 2018లో అయితే ఏకంగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు కూడా ఆయన ప్రకటించారు.

    రాజకీయాల్లో రాణించాలని

    రాజకీయాల్లో రాణించాలని

    2019 ఎన్నికలలో ఆయన సొంత ప్రాంతమైన చిత్తూరు జిల్లా ఎంపీ పదవికి పోటీ చేస్తాడని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయం మీద అప్పట్లో స్పందించిన కత్తి మహేష్ తాను ఎంపీగా పోటీ చేయడం నిజమే కానీ ఏ పార్టీ తరపున పోటీ చేస్తా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేనని అన్నారు. అయితే ఎప్పుడూ టిడిపి మీద విమర్శలు చేస్తూ ఉండే కత్తి మహేష్ వైసీపీకి కాస్త మద్దతు పలుకుతూ ఉండేవారు. దీంతో ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తారని అప్పట్లో భావించినా కత్తి మహేష్ ఆర్థికంగా అంత బలవంతుడు కాకపోవడంతో వైసీపీ అధిష్టానం మరో వ్యక్తికి టికెట్ ఇచ్చింది. అయితే ఎప్పటికైనా తనకు గుర్తింపు దక్కుతుందని భావిస్తూ వచ్చిన కత్తి మహేష్ కి రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక తీరకుండానే పోయింది.

    రాజకీయ మద్దతు అలా

    రాజకీయ మద్దతు అలా

    అయితే ఆయన వైసిపి కి మద్దతుగా మాట్లాడిన అనేకసార్లు అనేక సందర్భాల్లో వెనకేసుకొచ్చినందుకుగాను ఆయన చికిత్స కోసం 17 లక్షల రూపాయలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. దీని మీద అనేక విమర్శలు వచ్చిన ప్రభుత్వం ఎక్కడా తగ్గలేదు. ఇక కత్తి మహేష్ సినిమాల్లో కూడా నటుడిగా రాణించాలని తపన పడేవారు.

    Recommended Video

    Medicare hospital doctors would release health bulletin on Kathi mahesh health condition soon
    నటుడిగా రాణించాలని

    నటుడిగా రాణించాలని


    ఎవరినీ నేరుగా వేషాలు అడగకపోయినా తనకు మంచి నటుడిగా రాణించాలనే కోరిక ఉండేది. హృదయ కాలేయం సినిమాతో నటుడిగా మారిన ఆయన చాలా సినిమాల్లో నటుడిగా కనిపించారు. కానీ కానీ నటుడిగా ఒక రేంజ్ కి వెళ్ళాలని భావించిన ఆయనకు ఆ కోరిక కూడా తీరలేదని చెప్పాలి. అయితే ఆయన రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు.పెసరట్టు, ఎగిసేతారాజువ్వలు పేరుతొ రిలీజ్ అయిన ఆ రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు.

    English summary
    Telugu actor and film critic Kathi Mahesh has passed away. He was hospitalised in chennai after a road accident at nellore. he has two unfulfilled desires
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X