Kathi Mahesh లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్: రేపు మళ్ళీ ఆపరేషన్.. డాక్టర్స్ ఏమంటున్నారంటే?

ప్రముఖ సినీ విమర్శకుడు తర్వాత కాలంలో నటుడిగా, దర్శకుడిగా మారిన కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి విషమంగా ఉందని నిన్నటి నుంచి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆయన స్నేహితుడు సురేష్ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

పీలేరు వెళుతుండగా

పీలేరు వెళుతుండగా

విజయవాడ నుంచి కత్తి మహేష్ స్వస్థలమైన పీలేరు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురం వద్ద హైవే మీద ముందు వెళ్తున్న ట్రక్ ను ఢీకొన్న సంగతి తెలిసిందే. కారు ప్రమాదం అయిన వెంటనే కత్తి మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. సీటు బెల్టు పెట్టుకోవడంతో డ్రైవర్ కు పెద్ద గాయాలు కాలేదు.

 సీట్ బెల్ట్ పెట్టుకోక పోవడంతో

సీట్ బెల్ట్ పెట్టుకోక పోవడంతో

డ్రైవర్ వైపు ఉన్న ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఇబ్బంది లేకుండా బయట పడ్డారు. సీట్ బెల్ట్ పెట్టుకోక పోవడంతో కత్తి మహేష్ కు మాత్రమే గాయాలయ్యాయి. ఇక అపస్మారక స్థితిలో ఉన్న ఆయనని నెల్లూరు జిల్లాలోని మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. అయితే అక్కడ కంటికి ప్రాథమిక చికిత్స అలాగే అవసరమైన శస్త్రచికిత్స చేశారు.

చెన్నై అపోలోకు

చెన్నై అపోలోకు

అయితే అక్కడికి వచ్చిన ఆయన బంధువులు ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.. అక్కడికి తరలించినప్పటి నుంచి ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు అవసరమైన పరీక్షలు చేయగా వైద్యులకు మంచి కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి మీద ఒక క్లారిటీ వచ్చింది.

అప్డేట్స్ ఇస్తూ

అప్డేట్స్ ఇస్తూ

కత్తి మహేష్ కాస్త వివాదాస్పదంగా అంశాలకు దగ్గరగా ఉండే వ్యక్తి కావడంతో ఆయన గురించి పలురకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సన్నిహితులు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ తమ సోషల్ మీడియా వేదికగా ఇస్తున్నారు. ముఖ్యంగా రచయిత అరుణాంక్ లత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి, దర్శకుడు సాయి రాజేష్ లాంటి వాళ్ళు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు.

 రేపు ఆపరేషన్ తర్వాత

రేపు ఆపరేషన్ తర్వాత

తాజాగా అందుతున్న అప్డేట్ ప్రకారం ''రేపు మధ్యాహ్నం Cranio Facial reconstruction operation చేస్తున్నారని తెలిసింది. ముందు ఆ ఆపరేషన్ ద్వారా బోన్ స్ట్రక్చర్ రీ కన్స్ట్రక్ట్ చేశాక కంటి ఆపరేషన్ చేస్తారు. అయితే కంటి చూపు సమస్య ఉండదనే నమ్మకంతో ఉన్నారు డాక్టర్స్, రేపు ఆపరేషన్ తర్వాత మనకి పూర్తి విషయాలు తెలుస్తాయి, కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు'' అంటూ వెంకట్ సిద్దారెడ్డి పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X