Kathi Mahesh పరిస్థితి తీవ్ర విషమం.. పూర్తిగా కళ్ళు మూసేసి, వైద్యులు ఏమన్నారంటే?
ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే
Recommended Video

రోడ్ యాక్సిడెంట్
వివాదాస్పద క్రిటిక్ గా పేరు తెచ్చుకున్న కత్తి మహేష్ ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. చెన్నై కలకత్తా నేషనల్ హైవే మీద నెల్లూరు జిల్లాలోని చంద్రశేఖరపురం అనే గ్రామం దగ్గర కత్తి మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు రోడ్డు మీద వెళ్తున్న ఒక ఒక లారీని వెనుక వైపు నుంచి ఢీకొంది.

ఏమీ కాలేదని ప్రచారం
ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కు స్వల్ప గాయాలు అయ్యాయి అని ముందు వార్తలు బయటకు వచ్చాయి. ఇన్నోవాలో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెద్దగా గాయాలు కాలేదని భయపడాల్సింది ఏమీ లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నట్టుగా సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. అయితే అదంతా ఒట్టి ప్రచారమే అని తెలుస్తుంది.

కళ్ళకు శస్త్రచికిత్స
ఎందుకంటే తాజా సమాచారం మేరకు కత్తి మహేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి అని తెలుస్తోంది. ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు కళ్లకు కూడా గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కంటికి కూడా తీవ్ర గాయాలు కావడంతో నెల్లూరులో ఉన్న మెడికవర్ హాస్పిటల్ లో ఆయన కళ్ళకు శస్త్రచికిత్స కూడా చేశారని అంటున్నారు.

పరిస్థితి విషమం
రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కత్తి మహేష్ తో పాటు డ్రైవర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. డ్రైవర్ చెప్పిన తర్వాతే సదరు వ్యక్తి కత్తి మహేష్ అని గుర్తించిన పోలీసులు వెంటనే మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి విషమంగానే ఉందని అంటున్నారు. ఇక ఇప్పుడే పరిస్థితి ఏమీ చెప్పలేమని మరికొన్ని గంటలు ఆగితే గాని ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అనే విషయం మీద ఒక హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయలేమని వైద్యులు చెబుతున్నారు అని తెలుస్తోంది

పూర్తిగా కళ్ళు మూసేసి
ఇక అందుతున్న సమాచారం మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి అనుకూలిస్తే చెన్నైలోని శంకర్ నేత్రాలయకి తరలించి అక్కడ కంటికి అవసరమైన శస్త్రచికిత్స మళ్ళీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికైతే కత్తి మహేష్ హాస్పిటల్ బెడ్ మీద చికిత్స పొందుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన కళ్ళతో సహా ముక్కు కూడా పూర్తిగా బ్యాండెయిడ్ తో మూసి వేయగా ఆక్సిజన్ కూడా నోటి ద్వారా అందిస్తున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











