For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సలార్’ స్పెషల్ సాంగ్‌పై క్రేజీ న్యూస్: ఇద్దరు సీనియర్ హీరోల తర్వాత ప్రభాస్‌తో ఆ బ్యూటీ

  |

  టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాను చేస్తున్నాడతను. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. నిజానికి ఇది పట్టాలపై ఉండగానే ఈ పాన్ ఇండియా స్టార్ హీరో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K', ప్రశాంత్ నీల్ తెరకెక్కించే 'సలార్', ఓం రౌత్ డైరెక్షన్‌లో 'ఆదిపురుష్' వంటి మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇవన్నీ ఒక్కొక్కటిగా ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఆయా సినిమాల షూటింగుల్లో ప్రభాస్ పాల్గొంటున్నాడు.

  నిహారిక భర్త చైతన్యపై పోలీస్ కేసు: అర్ధరాత్రి ఆ విషయంలో మొదలైన గొడవ.. సీసీ పుటేజ్‌లో కీలక ఆధారాలు

  ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో 'సలార్'పై భారీ అంచనాలే ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి కారణం ఈ సినిమాను 'కేజీఎఫ్' వంటి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించిన ప్రశాంత్ నీల్ తీస్తుండడమే. ఎప్పుడో మొదలైన ఈ మూవీ షూటింగ్.. మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో కంప్లీట్ చేసుకుంది. అందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ ఫైట్‌ను కూడా రూపొందించారు. ఇక, రెండు రోజుల క్రితమే రెండోది కూడా మొదలైంది. ఈ షెడ్యూల్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించబోతున్నాడు దర్శకుడు.

  30 Weds 21 ఫేమ్ అనన్య గ్లామరస్ ఫోటోస్.. లేలేత అందాలతో..

  Katrina Kaif Special Song in Prabhass Salaar Movie

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ పాటను ఓ స్టార్ హీరోయిన్‌తో చేయిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్, ఊర్వశీ రౌటేలా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, శ్రీనిధి శెట్టి సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఆడిపాడనుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌పై ఆమె సంతకం కూడా చేసేసిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

  Pushpa Story లైన్ లీక్: రాఖీ భాయ్‌ను ఫాలో అవుతోన్న అల్లు అర్జున్.. గూస్‌బమ్స్ వచ్చేలా ప్లాన్!

  గతంలో కత్రినా కైఫ్.. విక్టరీ వెంకటేష్‌తో 'మల్లీశ్వరి', నందమూరి బాలకృష్ణతో 'అల్లరి పిడుగు' అనే సినిమాల్లో నటించింది. వీటి తర్వాత బాలీవుడ్‌కే పరిమితం అయిపోయిన ఈ భామ.. సుదీర్ఘ విరామం తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో అతడు తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడని కూడా అంటున్నారు. ఇధి 1970 నాటి కథతో సాగే ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతుంది.

  Chirajeevi మనవరాలు క్యూట్ ఫోటోలు.. మెగాస్టార్ కౌగిలిలో అలాప్రేమగా!

  ఇక, ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. అలాగే, ఓ స్టార్ హీరోయిన్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తుందనే టాక్ బాగా వినిపిస్తోంది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Young Rebel Star Prabhas Upcoming Movie is Salaar under Prashanth Neel Direction. Latest Buzz is That.. Bollywood Heroine Katrina Kaif will do Special Song in This Film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X