మహేష్ బాబుతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన కత్రినా కైఫ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉండగానే ఆయన తర్వాతి ప్రాజెక్ట్ సుకుమార్ దర్శకత్వంలో ఖరారైంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

తాజాగా ఓ ప్రతిక ఇంటర్వ్యూలో కత్రినా కైఫ్.. మహేష్ బాబు సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను సల్మాన్ ఖాన్ మూవీ 'భారత్'లో నటిస్తున్నానని, ఈ సినిమా తర్వాత తాను ఏ మూవీకి సైన్ చేయలేదని తెలిపారు. మహేష్ బాబు సినిమా కోసం తనను ఎవరూ సంప్రదించలేదన్నారు.

 Katrina Kaif wasn’t even approached for the Mahesh Babu film

కత్రినా స్టేట్మెంటుతో మహేష్-సుకుమార్ తర్వాతి సినిమాపై రూమర్లకు తెరపడినట్లయింది. 'మళ్లీశ్వరి' తర్వాత తెలుగు తెరకు దూరమైన కత్రినా మళ్లీ ఎప్పుడు టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తుందో అని ఎదురు చూస్తున్న అభిమానులు మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

మహేష్ బాబు-సుకుమార్ సినిమా విషయానికొస్తే... ఇటీవలే సుకుమార్ ఫైనల్ స్క్రిప్టు మహేష్ బాబుకు వినిపించినట్లు తెలుస్తోంది. 'మహర్షి' షూటింగ్ ముగిసిన వెంటనే సుకుమార్ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X