For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా అలా చూడాలనుకోవడం తప్పులేదు.. క్రేజీగా కౌసల్య కృష్ణమూర్తి ఫస్ట్ లుక్

|

నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ని దర్శకుడు భీమనేని శ్రీనివాస్‌ రిలీజ్‌ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ఐ.ఆండ్రూ, నటుడు కార్తీక్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అధినేత కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర టైటిల్‌ రోల్‌ ఐశ్వర్యా రాజేష్‌ పోషించారు. సీనియర్‌ నటుడు అమర్‌నాథ్‌ తనయుడు, కథానాయకుడు రాజేష్‌ కుమార్తె. తమిళ్‌లో 'కణ' అనే మూవీ చూసి ఈ సినిమా చాలా క్రియేటివ్‌గా ఉంది. ఇప్పటి యూత్‌కి కనెక్ట్‌ అయ్యేలా ఉంది అని ఈ చిత్రం రైట్స్‌ తీసుకున్నాను. ఈ చిత్రానికి దర్శకుడు భీమనేని శ్రీనివాస్‌ అయితే న్యాయం చేస్తారని ఆయన్ని కాంటాక్ట్‌ అవ్వడం జరిగింది. టైటిల్‌కి తగ్గట్లే ఆ అమ్మాయి టైలర్‌మేడ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ప్రదర్శించింది. తమిళ్‌, మలయాళం భాషల్లో 25 చిత్రాలకు పైగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ ఆమెకి తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. క్రికెట్‌ని బేస్‌తో పాటు కంటెంట్‌ ఉండే స్టోరి అని అన్నారు.

Kausalya Krishna Murthy: The Cricketer look released

చిత్ర దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''కౌసల్య కృష్ణమూర్తి' ఓపెనింగ్‌ అప్పుడు ఒక న్యూస్‌ వచ్చింది. మళ్ళీ షూటింగ్‌ పూర్తి చేసుకొని ఇప్పుడు మీ ముందుకు వచ్చాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉంది. కొన్ని వందల, వేల కథలు సినిమా రూపంలో ఆడియన్స్‌ ముందుకు వస్తాయి కాబట్టి కొత్త కథల్ని చూడాలనుకోవడంలో తప్పు లేదు. అలాంటి ఒక మంచి కథ కోసం వెదుకుతున్న సమయంలో తమిళంలో రిలీజై సూపర్‌హిట్‌ అయిన 'కణ' సినిమాని చూడటం జరిగింది. ఆ సినిమాని తెలుగులో చేద్దామనుకుంటున్న సమయంలో ఈ సినిమా తెలుగు రైట్స్‌ గురించి చాలామంది ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మనం తినే బియ్యపు గింజ మీద మన పేరు రాసుంటే ఎలా అయినా మన దగ్గరకి వస్తుంది అన్నట్లు ఒకరోజు కె.ఎస్‌. రామారావుగారు ఫోన్‌ చేసి, 'కణ' సినిమా రైట్స్‌ తీసుకున్నాను అని అన్నారు.

హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌ మాట్లాడుతూ - ''కౌసల్య కృష్ణమూర్తి' నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా. తమిళ్‌, మలయాళం, హిందీ సినిమాలు చేశాను. ఈ సినిమా తెలుగులో నా మొదటి చిత్రం అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాను క్రియేటివ్‌ కమర్షియల్స్‌ కె.ఎస్‌. రామారావుగారు, కె.ఎ. వల్లభ నిర్మాణంలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో చేయడం హ్యాపీ. అలాగే కార్తీక్‌ రాజు, ఆండ్రూ అందరూ టెక్నీషియన్స్‌ కష్టపడి క్రికెట్‌ని బేస్‌ చేసుకొని ఒక మంచి కంటెంట్‌ మూవీతో మీ ముందుకు వస్తున్నాం. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ మీ అందరికీ కచ్చితంగా నచ్చి ఉంటుంది అని అన్నారు.

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌ (స్పెషల్‌ రోల్‌), ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, 'రంగస్థలం' మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్‌, కథ: అరుణ్‌రాజా కామరాజ్‌, మాటలు: హనుమాన్‌ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్‌(కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, డాన్స్‌: శేఖర్‌, భాను, ఆర్ట్‌: ఎస్‌.శివయ్య, కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.

English summary
Kausalya Krishna Murthy: The Cricketer is new movie coming combo of KS Rama Rao and Bhimineni Srinivasa Rao. Yester year stars Rajesh and Sri Lakshmi's relative and actress Ishwaraya Rajesh is the lead heroine for this movie. Senior Actor Rajendra Prasad is in Important role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more