కౌసల్య కృష్ణమూర్తి కోసం.. గెస్టులుగా విజయ్ దేవరకొండ, రాశీఖన్నా
ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్'. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది.
కౌసల్య కృష్ణమూర్తి చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఆగష్టు 19న విడుదల చేశారు. ఒక అమ్మాయి ఇండియా తరఫున క్రికెటర్ గా ఆడాలన్న తన కల కోసం పడ్డ తపన, కష్టం ప్రతిబింబించేలా ట్రైలర్ సాగింది. చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, బ్యూటీ క్వీన్ రాశీ ఖన్నా ముఖ్య అతిధులుగా మంగళవారం (ఆగష్టు 20న) జె ఆర్ సి బాల్ రూమ్, హైదరాబాద్ నందు జరుగనుంది.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా ముఖ్య అతిథులుగా పాల్లొంటారు. ఈ వేడుక ఆగస్టు 20వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానున్నది. కాగా, క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌లో రూపొందుతున్న చిత్రంలో విజయ్ దేవరకొండ, రాశీఖన్నా జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
నటీనటులు: ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి రాజేంద్రప్రసాద్, శివకార్తికేయన్ (స్పెషల్ రోల్), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్.నరసింహారావు, వెన్నెల కిశోర్, 'రంగస్థలం' మహేశ్, విష్ణు(టాక్సీవాలా ఫేమ్), రవిప్రకాశ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ,
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు,
సంగీతం: దిబు నినన్,
కథ: అరుణ్‌రాజ కామరాజ్,
మాటలు: హనుమాన్ చౌదరి,
పాటలు: రామజోగయ్యశాస్త్రి, క ష్ణ కాంత్ (కెకె), కాసర్ల శ్యామ్, రాంబాబు గోసల,
ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్,
డాన్స్: శేఖర్, భాను,
ఆర్ట్: ఎస్.శివయ్య,
కో-డైరెక్టర్: బి.సుబ్బారావు,
ప్రొడక్షన్ కంట్రోలర్: బి.వి.సుబ్బారావు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ.సునీల్‌కుమార్,
లైన్ ప్రొడ్యూసర్: వి.మోహన్‌రావు,
సమర్పణ: కె.ఎస్.రామారావు,
నిర్మాత: కె.ఎ.వల్లభ,
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.


Click it and Unblock the Notifications











