twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్లేటు ఫిరాయించిన కౌశల్.. బీజేపీలోకి ఎంట్రీ

    |

    Recommended Video

    Bigg Boss Telugu 2 Winner Kaushal Manda Joins BJP, Gets Trolled ! || Oneindia Telugu

    బిగ్‌బాస్ షో అనేది కొంతమందిని ఆకాశనికెత్తేస్తే..కొంతమందిని అధ:పాతాళానికి తొక్కేస్తుంది. అలా రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసి చివరకు విన్నర్‌గా నిలిచాడు కౌశల్. షోలో వ్యవహరించిన తీరు, ఆడిన విధానానికి ఎంతో మంది అభిమానులుగా మారారు. కౌశల్ ఆర్మీ పేరిట నిర్వహించిన ర్యాలీలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విన్నర్‌గా నిలిచిన కౌశల్ బయటకు వచ్చాక కూడా అంతకంటె ఎక్కువగా విమర్శల పాలయ్యాడు.

     కౌశల్ ఆర్మీ ఫేక్ అంటూ..

    కౌశల్ ఆర్మీ ఫేక్ అంటూ..

    కౌశల్ ఆర్మీ అనేది ఫేక్ అంటూ అదంతా పెయిడ్ బ్యాచ్ అని అప్పట్లో ఎంతో మంది విమర్శించారు. కౌశల్ భార్య నీలిమ అదంతా నడిపిస్తోందని రూమర్లు వినిపించాయి. ఈ ఘటనపై పలు టీవీ చానెళ్లలో గంటల తరబడి డిబేట్లు కూడా జరిగాయి. కౌశల్‌కు డాక్టరేట్ పట్టా, ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ రావడం లాంటివి చెప్పడం.. అవన్నీ ఫేక్ అని నిరూపించడం తెలిసిందే.

    కౌశల్ ఆర్మీలో చీలికలు..

    కౌశల్ ఆర్మీలో చీలికలు..

    తమను కౌశల్ మోసం చేస్తున్నాడని, తమ డబ్బులు ఖర్చుపెట్టిస్తున్నాడని కొందరు సభ్యులు కౌశల్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వారు బయటకు వచ్చి కౌశల్, నీలిమపై విమర్శలు చేశారు. తమకు ఎదురు తిరిగితే మిగతా వారితో టార్గెట్ చేయిస్తున్నారంటూ.. తనతో సినిమా తీయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

    వివాదస్పదంగా మారిన కౌశల్ ఫౌండేషన్

    వివాదస్పదంగా మారిన కౌశల్ ఫౌండేషన్

    బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన కౌశల్‌కు యాభై లక్షల ప్రైజ్ మనీ రాగా.. అవన్నీ కౌశల్ ఫౌండేషన్‌కు బదలాయిస్తానని, క్యాన్సర్ బాధితుల కోసం ఆ డబ్బును వినియోగిస్తానని చెప్పి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కౌశల్ ఆర్మీ సభ్యులు కూడా ఆ ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వడం.. వాటిని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపణలు చేయడం తెలిసిందే.

    రాజకీయాల్లో ఎంట్రీ..

    అప్పట్లో కౌశల్ కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు చాలానే ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబును కలిశాడు. ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేయాలని చాలా గట్టిగానే ప్రయత్నించినా.. అది కుదరలేదు. అయితే తాజాగా సందు చూసి వేరే పార్టీలోకి జంప్ అయ్యాడు.

    బీజేపీ తీర్థం..

    బీజేపీ తీర్థం..

    తాజాగా కౌశల్, ఆయన భార్య ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. సతీసమేతంగా ఢిల్లీకి వెళ్లిన కౌశల్.. అక్కడ బీజేపీ కండువా కప్పుకున్నాడు. మోడీ విజన్ నచ్చి.. ఆయన హయంలోనే దేశం అభివృద్ది సాధిస్తుందని అందుకే బీజేపీలో చేరానని కౌశల్ చెప్పుకొచ్చాడు. ఇక కౌశల్ కూడా రాజకీయ నాయకుడిగా మారాడంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నాడు.

    English summary
    Kaushal Manda Joins In BJP. I always want to be the person who does n't only reacts on every ongoing issue in the country but would always want to convert some great ideas into reality so as to tackle with it. Here Iam joining BJP after getting motivated &inspired by Modi Ji's Vision.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X