చిరు అందులో దిట్టా.. అలా చేయాలని ట్రై చేస్తున్నా.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కౌశల్
బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ విన్నర్ కౌశల్ పేరు అందరూ వినే ఉంటారు. కౌశల్ ఆడిన ఆట కంటే.. అతని అభిమానులు సోషల్ మీడియాలో చేసిన రచ్చే అందరికీ ఎక్కువగా గుర్తుండి ఉంటుంది. కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసి ప్రత్యర్థులను మాట్లాడకుండా చేశారు. దీంతో కౌశల్ ఆర్మీపై ఎంతగా ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే.
అయితే రెండో సీజన్ విన్నర్ అయిన కౌశల్.. ప్రస్తుతం వాటికి సంబంధించిన జ్జాపకాలను నెమరు వేసుకుంటున్నాడు. సోషల్ మీడయాలో తరుచుగా వీటికి సంబంధించిన పోస్ట్లే పెడుతూ ఉంటాడు. బిగ్ బాస్ లో తన వంద రోజుల జర్నీ, తన పిల్లల్ని కలిసిన సందర్భం, టైటిల్ గెలిచిన రోజు అంటూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటాడు.

తాజాగా తన కూతురు లల్లీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపాడు. ప్రస్తుతం తన కొడుకుతో కలిసి గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. అయితే హార్స్ రైడింగ్ అనేది చిరంజీవిని చూసి నేర్చుకున్నానని, గుర్రపు స్వారీచేయడంలో చిరు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందేనని అన్నాడు. అయితే ఆయన్ను చూసి.. తాను కూడా అలా చేయాలనుకున్నానని తన పదిహేనవ ఏట నుంచే ప్రారంభించానని, కానీ ఇంకా చేయలేకపోతున్నానని ప్రస్తుతం తన కొడుకు కూడా నేర్చుకుంటున్నాడని తెలిపాడు. చిరంజీవి నటించిన సైరా చిత్రంపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు.


Click it and Unblock the Notifications











