బెల్లంకొండ శ్రీనివాస్-కాజల్ మూవీ ‘కవచం’ టీజర్ ఎప్పుడంటే?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాలజ్ అగర్వాల్ జంటగా నటిస్తున్న 'కవచం' మూవీ టీజర్ నవంబర్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో శ్రీనివాస్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు.

థ్రిల్లర్ కాన్సెప్టుతో తెరకెకకుతున్న ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. మెహ్రీన్, హర్షవర్ధన్ రాణె, బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, అపూర్వ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.

‘Kavacham’ Teaser release date Nov 12th

పాటలు మినహా ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా వస్తున్న ఈ సినిమాని నవీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు.

డిసెంబర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అతడి గత చిత్రం సాక్ష్యం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X