అంచనాలు పెంచిన ‘కవచం’ థియేట్రికల్ ట్రైలర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్ ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం 'కవచం'. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు 10 మిలియన్ డిజిటల్ వ్యూస్‌తో అద్భుతమైన స్పందన రాగా... తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. డిసెంబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'కవచం' ద్వారా శ్రీనివాస్ మామిళ్ళ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కొత్త దర్శకుడే అయినా ట్రైలర్ చూస్తుంటే అనుభవం ఉన్న డైరెక్టర్ తీసినట్లు ఉండటం గమనార్హం.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ట్రైలర్లో అతడి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ప్లస్సవ్వడం ఖాయం.
హర్షవర్ధన్ రానే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వారి మధ్య వచ్చే సన్నివేశాలు, హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ కాబోతున్నాయి.

నటీనటులు:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అపూర్వ..
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: శ్రీనివాస్ మామిళ్ళ
నిర్మాత: నవీన్ చౌదరి సొంటినేని (నాని)
నిర్మాణ సంస్థ: వంశధార క్రియేషన్స్
సహ నిర్మాత: చాగంటి సంతయ్య
సంగీతం: ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫర్: ఛోటా కే నాయుడు
ఎడిటర్: ఛోటా కే ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: చిన్నా


Click it and Unblock the Notifications











