twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జార్జి బుష్ ప్రశంస మరువలేనిది.. మట్టి మనిషి ఫిల్మ్ ప్రివ్యూలో పద్మశ్రీ వెంకటరెడ్డి

    |

    నటుడు, రచయిత బాసంగి సురేష్ రచించిన కవితా చిత్రమ్ పుస్తకావిష్కరణ రామనాయుడు స్టూడియోస్‌లో జరిగింది. ఈ వేడుకలో భాగంగా బాసంగి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మట్టి మనిషి సినిమా ప్రివ్యూ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా నటుడు, రచయిత, దర్శకుడు హర్షవర్ధన్, గౌరవ అతిథిగా పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి హాజరయ్యారు. కవితా చిత్రమ్ పుస్తకావిష్కరణ రచయిత హర్షవర్ధన్ చేతుల మీదగా జరిగింది. ఈ వేడుకలో పేరడీ గురుస్వామి తన పేరడీ, రివర్స్ పాటలు, స్టాండప్ కామెడీతో ఆహూతులను అలరించారు. ఈ కార్యక్రమంలో చిత్రకారుడు, సినీ గీత రచయిత తుంబలి శివాజీ, సినీ దర్శకులు, ఎస్ ఎస్ పట్నాయక్, కర్రి బాలాజీ, కాళీ చరణ్, మధుసూదన రావు, సంగీత దర్శకుడు సాహిణి శ్రీనివాస్, మట్టి మనిషి దర్శకుడు విరాజ్ వర్మ, నటులు నవీన్, హరినాయక్ తదితరులు పాల్గొన్నారు.

    చింతల వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నా సాంకేతికత ఏమిటంటే సాగుచేస్తున్న నేలలో నిస్సారవంతమైన భూమిని సారవంతం చేయడం. 2004 సంవత్సరంలో పేటెంట్ చేయబడింది. ఇది తెలుసుకుని 2006 సంవత్సరంలో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ అనధికార పర్యటనపై వచ్చి నన్ను కలిసి మాట్లాడారు. ఆ తర్వాత మానవాళికోసం చాలా మంచి పని చేశారని అభినందించారు. ఒక రైతుగా నేను చేసినవే పేటెంట్ కోసం రాశాను. వాటిని వాళ్ళు శాస్త్రీయంగా పరిశీలించి యదాతథంగా ఆమోదించారు. ఈ విషయం గురించి ప్రధాని మోదీ కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడం జరిగింది అని అన్నారు

    Kavitha Chitram book unvieled at Matti Manishi premier show by writer Harshavardhan

    నటుడు, రచయిత హర్షవర్ధన్ గారు మాట్లాడుతూ... పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతల వెంకటరెడ్డి గొప్ప శాస్త్రజ్ఞుడు. ఆయన సాధించిన విజయం చిన్న విజయం కాదు. నిరుత్సాహపడుతున్న రైతులకు స్పూర్తి నిచ్చారు. అలాంటి అద్బుతమైన వ్యక్తిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన స్పూర్తితో తీసిన మట్టిమనిషి డెమో ఫిల్మ్ బాగుంది. ఆయన బయోపిక్ కూడా రావాలని కోరుకుంటున్నా. మట్టిమనిషిలో ప్రధానపాత్రలో బాసంగి సురేష్ అద్భుతంగా నటించారు అని అన్నారు.

    షేడ్స్ స్టూడియో సీఈవో దేవీ ప్రసాద్ మాట్లాడుతూ.. బాసంగి సురేష్‌కి సినిమా రంగంపై చాలా మక్కువ, ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్చంద విరమణ తీసుకొని షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఓపిక పట్టుదలతో శ్రమిస్తూ మాలాంటి వాళ్ళకు స్పూర్తి కలిగించడం అభినందనీయం అని అన్నారు.

    బాసంగి సురేష్ మాట్లాడుతూ:
    ముఖ్య అతిథి హర్షవర్ధన్ గారికి, మట్టిమనిషి తీయటానికి స్పూర్తినిచ్చి, కార్యక్రమానికి హాజరైన పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతల వెంకటరెడ్డి గారికి కథా చిత్రమ్ పుస్తక రూపకల్పనలో సహకరించిన చిత్రకారుడు తుంబలి శివాజీ గారికి, మట్టి మనిషి డెమో ఫిల్మ్ మేకింగ్ లో సహకారం అందించిన షేడ్స్ స్టూడియో అధినేత దేవీప్రసాద్ బలివాడ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

    English summary
    Kavitha Chitram book launch and 'Matti Manishi' film preview by actor-writer Harshavardhan. Book launch of 'Kavitha Chitram' written by actor and writer Basangi Suresh and movie preview of Basangi Suresh starrer 'Matti Manishi' were held at Ramanaidu Studios.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X