Kavya Maran Vs Ananya Birla: ఐపీఎల్‌లో అందాల భామల హవా.. క్రికెట్‌లో వారసురాళ్ల గ్లామర్ జిగేల్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 క్రికెట్ అభిమానులేనే కాకుండా సినీ ప్రేక్షకులకు కన్నుల పండువగా మారబోతున్నది. ప్రతీ ఏడాది గ్లామర్ డోస్‌ను పెంచుతూనే ఉన్నారు. చీర్ లీడర్స్ ఓ వైపు ఈ ఆటను అందాల పోటీలను తలదన్నేలా మార్చితే.. ఈ రంగంలోకి అడుగుపెట్టిన బిజినెస్ లెజెండ్స్ వారసురాళ్లు క్రీడాభిమానులను ప్రభావితం చేస్తున్నారు. ప్రీతీ జింటా, షారుక్ ఖాన్, శిల్పాశెట్టి లాంటి సీనీ తారలు క్రికెట్ టోర్నీతో ముడిపడి ఉండగా.. ఇటీవల కాలంలో సన్ పిక్చర్స్, సన్ గ్రూప్ అధినేత మారన్ కూతురు కావ్య మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున తన సత్తాను చాటుతున్నది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున అనన్య బిర్లా కూడా క్రికెట్ స్టేడియాన్ని గ్లామర్‌తో నింపేసింది. కావ్య మారన్, అనన్య బిర్లా ఇద్దరి ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారారు. వారికి సంబంధించిన వైరల్ న్యూస్ వివరాల్లోకి వెళితే.

సన్ గ్రూప్ నుంచి సన్ రైజర్స్ జట్టు పగ్గాలను చేజిక్కించుకొన్న కావ్య మారన్ ప్రస్తుతం క్రికెటర్లను మించిన సెలబ్రిటీ స్టేటస్‌తో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొన్నారు. గతంలో ఐపీఎల్‌ను ఇంపాక్ట్ చేసిన శిల్పాశెట్టి, ప్రీతి జింటాను కావ్య మారన తన గ్లామర్‌తో వెనక్కి నెట్టారనే టాక్ సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Kavya Maran Vs Ananya Birla

అయితే పతనావస్థలో ఉన్న సన్ రైజర్స్‌ను టైటిల్ రేసులోకి తెచ్చిన కావ్య మారన్ ప్రస్తుతం వివాదాల నడుమ కొనసాగుతున్నది. పాకిస్థాన్ క్రికెటర్‌ను జట్టులోకి తీసుకోవడంపై నెటిజన్లు, క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు భగ్గుమంటున్నారు. కావ్య మారన్‌ను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ తరఫున అనన్య బిర్లా అనూహ్యంగా ఐపీఎల్‌ తెరపైకి దూసుకు వచ్చింది.

మార్చి 28న అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ టోర్నీలో అనన్య బిర్లా ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆర్సీబీ జెర్సీ ధరించిన ఈ అందాల భామ తమ జట్టు తరఫున బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తారు. ఆర్సీబీని సుమారుగా 17 వేల కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఈ యువ వ్యాపారవేత్త అందం, ఇంటెలిజెన్స్‌తో ఆకట్టుకోబోతున్నారు.

ప్రస్తుతం ఐపీఎల్ క్రీడకు గ్లామర్ డోస్‌ను పెంచుతున్న ఈ ముద్దు గుమ్మలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రెండు ఫ్రాంచైజీలు ఆట కంటే.. ఆ జట్టు ఓనర్ల అందచందాలే ప్రత్యేకమైన చర్చకు దారి తీస్తున్నాయి. ఆర్సీబీ కొత్త యజమాని అనన్య బిర్లా తొలి మ్యాచులోనే కావ్య మారన్‌ను పాపులారిటీని అదిగమించే ప్రయత్నం చేశారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల బలాబలాల కంటే స్టేడియంలో అనన్య, కావ్య మారన్ గురించే ఎక్కువ చర్చ జరుగుతున్నది. బెంగళూరు జట్టు యజమానిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత అనన్య పాపులారిటీ సోషల్ మీడియాలో అనూహ్యంగా మారిపోయింది. 4.5 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఆమె సోషల్ మీడియాలో అకౌంట్ ఒక్కసారిగా 2.4 మిలియన్ ఫాలోవర్స్‌కు చేరుకొన్నది. వారంలోపే 2 మిలియన్ల ఫాలోవర్స్‌ అనన్య సంపాదించుకోవడం చర్చనీయాంశమైంది.

అనన్య బిర్లా వ్యక్తిగత, ప్రొఫెషనల్ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా పెద్ద కుమార్తె. పిలానీలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచ్‌లర్ డిగ్రీని సంపాదించుకొన్నది. వ్యాపారవేత్తగా రాణిస్తూనే సింగర్‌గా, సాంగ్ రైటర్‌గా పేరు సంపాదించుకొన్నది. గిటార్, సంతూర్, పియానా ప్లే చేయడంలో టాప్. యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా అనే సంస్థను కూడా స్థాపించింది. ప్రస్తుతం ఆర్సీబీ యజమానిగా పాపులారిటీని అనూహ్యంగా సంపాదించుకొన్నారు.

Read more about: kavya maran ipl Ananya Birla
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X