కేసీఆర్ బయోపిక్‌లో మార్పులు: ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్‌లో కనిపించని నాజర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఉద్యమ సింహం'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ ఏడాది జూన్లో ఈ మూవీ ప్రారంభోత్సవం జరుపుకోగా... కేసీఆర్ పాత్రను ప్రముఖ దక్షిణాది నటుడు నాజర్ పోషిస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే కేసీఆర్ పాత్రలో నటరాజన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి నాజర్ తప్పుకోవడానికి కారణం ఏమిటో తెలియాల్సి ఉంది.

కాగా... ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోస్టర్ మీద 'తెలంగాణ కేసరి... తెలంగాణాకే సిరి అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ మీద ఉన్న వ్యాఖ్యలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.

KCRs Biopic Udyama Simham first look launched

దర్శకుడు అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ ఈ సినిమాలో కేవలం రాజకీయ అంశాలే కాకుండా కేసీఆర్‌ గురించి ప్రజలకి తెలియని ఎన్నో విషయాలు చూపించబోతున్నట్లు తెలిపారు.

న‌ట‌రాజ‌న్ (గిల్లిరాజా), సూర్య‌, పి.ఆర్.విఠ‌ల్ బాబు ప్రధా పాత్రలు పోషిస్తుండగా జెన్నీ, సి.హెచ్.పి.విఠ‌ల్, ఆకేళ్ల గోపాల‌కృష్ణ‌, గిరిధ‌ర్, జ‌ల‌గం సుధీర్, మాధ‌విరెడ్డి, ల‌త ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి పాట‌లు: సి.హెచ్. రాములు, కొరియోగ్ర‌పీ: గ‌ణేష్, ఫైట్స్: సూప‌ర్ ఆనంద్, ఎడిటింగ్:న‌ంద‌మూరి హ‌రి, సినిమాటోగ్ర‌ఫి: ఉద‌య్ కుమార్, సంగీతం: దిలీప్ బండారి, మాట‌లు: ర‌ఆపోలు కృష్ణ‌ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: రామారెడ్డి పేట రాజ‌శేఖ‌ర్, స‌హ‌నిర్మాత‌: మేకా రాఘ‌వేంద్ర‌, క‌థ‌, నిర్మాత‌: క‌ల్వ‌కుంట్ల నాగేశ్వ‌ర‌రావు, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: అల్లూరి కృష్ణంరాజు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X