కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ రిలీజైంది.. యూట్యూబ్‌లో ఫ్రీ షో!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఉద్యమ సింహం'. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజైంది. ఏ థియేటర్లో అని మాత్రం అడగొద్దు. ఎందుకంటే దీన్ని థియేటర్లో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఎలాంటి రుసుము లేకుండానే ఫ్రీగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చారు.
వాస్తవానికి ఈ చిత్రాన్ని మార్చి 29న థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నారు. కానీ పలు కారణాలతో నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకున్నారు. నేరుగా యూట్యూబ్‌లో విడుదల చేయడంతో పాటు టెలివిజన్ ప్రసార హక్కులు కూడా ఉచితంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కొందరు సినిమా థియేటర్లలో విడుదల కాకుండా అడ్డంకులు సృష్టించారని, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులను బెదిరించారని ఆరోపించారు.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

థియేటర్లలో కాకుండా ఇలా నేరుగా ఆన్‌లైన్లో, అది కూడా ఉచితంగా రిలీజ్ చేయడం వెనక కారణం ఏమిటనే చర్చ మొదలైంది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ గురించి తీసిన 'యాత్ర' చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇక కేసీఆర్ బయోపిక్ అంటే తెలంగాణ ప్రాంతంతో తప్ప ఆంధ్రప్రాంతంలో ఆడటం కష్టమే.
రిలీజ్ చేసిన తర్వాత ఒక వేళ థియేటర్లు వెలవెలపోతే కేసీఆర్ మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా 'ఉద్యమ సింహం' చిత్రం నేరుగా యూట్యూబ్‌లో విడుదల కావడంపై కేసీఆర్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు.
నటరాజన్ (గిల్లిరాజా), సూర్య, పి.ఆర్.విఠల్ బాబు ప్రధా పాత్రలు పోషిస్తుండగా జెన్నీ, సి.హెచ్.పి.విఠల్, ఆకేళ్ల గోపాలకృష్ణ, గిరిధర్, జలగం సుధీర్, మాధవిరెడ్డి, లత ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: సి.హెచ్. రాములు, కొరియోగ్రపీ: గణేష్, ఫైట్స్: సూపర్ ఆనంద్, ఎడిటింగ్:నందమూరి హరి, సినిమాటోగ్రఫి: ఉదయ్ కుమార్, సంగీతం: దిలీప్ బండారి, మాటలు: రఆపోలు కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామారెడ్డి పేట రాజశేఖర్, సహనిర్మాత: మేకా రాఘవేంద్ర, కథ, నిర్మాత: కల్వకుంట్ల నాగేశ్వరరావు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: అల్లూరి కృష్ణంరాజు.


Click it and Unblock the Notifications











