జూ. ఎన్టీఆర్ హీరోయిన్ 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. ఓ అమ్మాయి క్రైమ్ స్టోరితో హాట్ హాట్‌గా

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకొన్న కీర్తీ చావ్లా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నది. హిందీలో గులామ్ ఏ ముస్తాఫా చిత్రంతో అడుగు పెట్టిన ఈ అందాల భామ ఆది చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమైన సంగతి తెలిసిందే. అయితే తెలుగు చిత్రాలకు దూరమైన ఈ బ్యూటీ తమిళంలో దాదాపు స్థిరపడి పోయారు. తెలుగులో బ్రోకర్ చిత్రంలో చివరిసారిగా కనిపించారు. దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత ఓ అమ్మాయి క్రైమ్ స్టోరి అనే చిత్రంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

కరోనా సమయంలో క్లినిక్‌లోకి కరీనా.. కెమెరా కంటికి చిక్కిన బ్యూటీ

చిన్నా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ చిత్రంలో కీర్తి చావ్లా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సాధిక, ఆది ప్రేమ్, కవిత, శ్రీమాన్, గౌతమ్ రాజు, నిలగళ్ రవి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జీ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఏబి శ్రీనివాస్, ఆర్ సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 30 న విడుదల కానున్నది.

 Keerthi Chawla reentry in tollywood with O Ammayi Crime story

ఈ సందర్భంగా నిర్మాత ఏబీ శ్రీనివాస్ మాట్లాడుతూ .. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ‌లో కీర్తి చావ్లా ముఖ్య పాత్రను పోషించింది. హర్రర్ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్‌తో పాటు, రొమాంటిక్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. గతంలో విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నాం. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 30న ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం అని అన్నారు.

 Keerthi Chawla reentry in tollywood with O Ammayi Crime story

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X