అలాంటి విషయాలను పట్టించుకోను.. క్రేజీ హీరోతో కీర్తీ సురేష్..
మహానటి చిత్రంతో తన స్టార్ రేంజ్‌ను పెంచుకొన్న కీర్తీ సురేష్.. అప్పటి నుంచి వెనుకకు తిరిగి చూసుకోలేదు. వరుస విజయాలతో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నది. దక్షిణాదిలోనే కాదు... బాలీవుడ్‌లో కూడా జెండా పాతేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె కథలను, సినిమాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోనే తీరు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ.. నా వద్దకు వచ్చే కథలను జాగ్రత్తగా విని ఎంపిక చేసుకొంటాను. ఎలాంటి సందేహాలు ఉన్నా నా సన్నిహితులను, కుటుంబ సభ్యులతో సరి చూసుకొంటాను అని అన్నారు.
కెరీర్‌ను పక్కా ప్లాన్‌తో సాగించాలనే సన్నిహితుల మాటలను జాగ్రత్తగా పాటిస్తాను. అలాంటి పాత్రల్లోనే నటించాలి.. ఆ రోల్స్‌లోనే కనిపించాలనే నియమాన్ని నేను పెట్టుకోలేదు. నా ముందుకు వచ్చిన బెస్ట్ ఆప్షన్స్ ప్రకారం నేను ముందుకెళ్తుంటాను అని కీర్తీ సురేష్ చెప్పింది.

ఇది ఇలా ఉండగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హీరోగా క్రీడా నేపథ్యంతో రూపొందుతున్న బయోపిక్ చిత్రంలో నటించేందుకు కీర్తీ సురేష్ ఒకే చెప్పింది. హిందీలో 'బదాయి హో' లాంటి హిట్ చిత్రాన్ని అందించిన అమిత్ శర్మ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించబోతున్నారు.
అలాగే ప్రముఖ దర్శకుడు నాగేష్ కుకునూర్ తెరకెక్కించే చిత్రంలో కూడా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. నాగేశ్ కుకునూర్ చెప్పిన కథ విన్న వెంటనే బాలీవుడ్ చిత్రంలో నటించడానికి కీర్తీ సురేష్ అంగీకరించిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్నది.
అయితే సైరా నర్సింహారెడ్డి చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారనే వార్త మీడియాలో తెగ ప్రచారం అవుతున్నది. ఈ సినిమా కోసం ముందుగా నయనతార, అనుష్క పేర్లను చిత్ర యూనిట్ పరిశీలించింది. అయితే తాజాగా అనూహ్యంగా కీర్తీ సురేష్ పేరు తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.


Click it and Unblock the Notifications











