కీర్తి సురేష్ కొత్త సినిమా వచ్చేది ఓటీటీలో కాదట.. నేరుగా థియేటర్లలోకే.. ఎప్పుడంటే?

కీర్తి సురేష్, జయం రవి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న సైరెన్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. అలాగే మొన్నామధ్య ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ వార్తలు తెలిసిన చాలా మంది షాక్ అయ్యారు. మల్టీస్టారర్ సినిమా.. అది కూడా మంచి బజ్ ఉన్న సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయడం ఏంటి అనుకున్నారు. అంతా అనుమానించినట్లుగానే ఆ వార్తలు అన్నీ పుకార్లు అని తెలిసిపోయింది. తాజాగా సైరస్ మూవీ టీం ఈ చిత్రం విడుదల తేదీని వెల్లడించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జయం రవితో హీరోగా.. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా వస్తున్న ఈ సినిమాలో యోగాబాబు, సముద్రఖని, కౌశిక్ మెహతాలు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఆంటోని భాగ్యరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా.. విపరీతమైన స్పందన వచ్చింది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్రైలర్ తోనే అందిరోనూ అంచనాలు పెంచేసిన ఈ సినిమా త్వరగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Keerthy Suresh And Jayam Ravi Siren Movie Release Date Confirmed Check Details

చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పటి నుంచో విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఇంతకాలం విడుదల కాలేదు. అందుకు కారణాలు ఎవరికీ తెలియదు. అలా సినిమా రావడానికి ఆలస్యం కావడం వల్లే నేరుగా ఓటీటీలోనే విడుదల కాబోతుందంటూ పెద్ద ఎత్తన వార్తలు వచ్చాయి. అయితే వాటిని చిత్రబృందం ఖండించకపోవడంతో అంతా అదే నిజం అనుకున్నారు. కానీ కొందరు మాత్రం అన్ని హంగులతో కమర్షియల్ గా రూపొందించిన ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం వారు చెప్పిందే నిజం అయింది.

 Keerthy Suresh And Jayam Ravi Siren Movie Release Date Confirmed Check Details

తాజాగా సైరన్ మూవీ టీం ఈ సినిమా విడుదల తేదీనీ వెల్లడించింది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అలాగే కీర్తి సురేష్, జయం రవి కొత్త పోస్టర్ లను కూడా విడుదల చేశారు. అంబులెన్స్ డ్రైవర్ గా పని చేసి క్రిమినల్ గా మారిన ఓ వ్యక్తి కథను థ్రిల్లింగ్ గా మలించారు. అయితే 14 ఏళ్లు జైల్లో ఉన్న అతడు బయటకు వచ్చాకా ఏం చేశాడనేది సినిమా అసలు కథ. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X