130 బంగారు కాయిన్స్ పంచిపెట్టిన కీర్తీ సురేష్.. 75 లక్షల విలువైన గిఫ్టులు ఎవరికి గిఫ్టుగా ఇచ్చిందంటే?
మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిన కీర్తీ సురేష్ మరోసారి పవర్‌ఫుల్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నానికి జంటగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్యాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో కీర్తీ సురేష్‌కు సంబంధించి మీడియాలో వైరల్ అయిన ఓ వార్త గురించిన వివరాల్లోకి వెళితే..

దసరా సినిమాలో నానికి స్నేహితులుగా, అలాగే కీర్తీ సురేష్‌కు ఫ్రెండ్స్‌గా చాలా మంది నటించారు. అలాగే కాకుండా చాలా మంది ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రలను పోషించారు. దసరా సినిమాలో నటించిన తన తోటి నటీనటులుకు దాదాపు 130 గోల్డ్ కాయిన్స్‌ను బహుకరించినట్టు యూనిట్ సభ్యులు తెలిపారు.
దసరా సినిమా షూటింగ్ చివరి రోజున కీర్తీ సురేష్ చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా నెలలు తనతో ట్రావెల్ అయిన వారికి ఏదో ఒకటి ఇవ్వాలని అనుకొన్నారు. తనతో నటించిన నటీనటుల కోసం 75 లక్షల వెచ్చించి బంగారు కాయిన్స్ తెప్పించారు. 10 గ్రాములు బరువు ఉన్న 130 బంగారు కాయిన్స్ తెప్పించి తనతో నటించిన వారికి బహుమతిగా ఇచ్చారు అని తెలిపారు.
ఇక దసరా సినిమా విషయానికి వస్తే.. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన దసరా చిత్రం మార్చి 30 తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా కోసం నాని, కీర్తీ సురేష్ ఇద్దరు మేకప్ పరంగా లుక్ పరంగా పూర్తిగా మారిపోయారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు, టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలు పెంచడంతో ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఏర్పడింది.


Click it and Unblock the Notifications











