twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Good Luck Sakhi Trailer: ఇది ఓడితే నాతో వస్తదా? ఎమోషనల్‌గా గుడ్ లక్ సఖి ట్రైలర్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువ సంఖ్యలో వస్తున్న విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే మన ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు రావడంతో సరికొత్త నేపథ్యాలతో సినిమాలు రూపొందుతున్నాయి. మరీ ముఖ్యంగా కొంత కాలంగా క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలు చాలానే వస్తున్నాయి. ఇప్పటికే ఈ తరహాలో వచ్చిన మూవీలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. దీంతో ఇలాంటివి మరిన్ని సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు షూటింగ్ స్పోర్ట్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న చిత్రం 'గుడ్ లక్ సఖి'.

    మరోసారి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: ముందు వెనుక మొత్తం చూపిస్తూ రచ్చమరోసారి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: ముందు వెనుక మొత్తం చూపిస్తూ రచ్చ

    'మహానటి' చిత్రంతో తెలుగు సినీ రంగంలో తనదైన మార్క్ చూపించిన కీర్తి సురేష్ లీడ్ రోల్‌ చేస్తున్న చిత్రమే 'గుడ్ లక్ సఖి'. నగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 2019లోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. కానీ, ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్‌కు పలుమార్లు ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు. దీంతో ఈ సినిమా ఆగిపోతుందేమోనన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర యూనిట్ స్పందిస్తూ ఈ సినిమా త్వరలోనే వస్తుందని తెలిపింది.

    Keerthy Suresh Good Luck Sakhi Official Trailer Released

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'గుడ్ లక్ సఖి' మూవీ షూటింగ్‌ను ఇటీవలే పున: ప్రారంభించి శరవేగంగా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంచారు. ఇక, ఈ చిత్రాన్ని జనవరి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం వేగవంతం చేసేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే సినిమా టీజర్, పాటలను విడుదల చేశారు. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గుడ్ లక్ సఖి' మూవీ అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

    హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చహాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ

    'మన దేశం గర్వపడేలా షూటర్లను తయారు చేయబోతున్నాను' అంటూ జగపతి బాబు చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అయింది. ఆయనకు ఆది పినిశెట్టి.. 'బ్యాడ్ లక్ సఖి'గా పేరొందిన కీర్తి సురేష్‌ను పరిచయం చేస్తాడు. అప్పటి వరకూ ఎన్నో ఫెయిల్యూర్స్ చూసిన ఆ పల్లెటూరి అమ్మాయిని ప్రపంచ స్థాయి షూటర్‌గా తయారు చేయాలని కోచ్ జగపతి బాబు భావిస్తాడు. ఈ క్రమంలోనే వీళ్లకు ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. ఒకానొక సందర్భంలో ఓ ఆటగాడు 'అది ఓడితే నాతో వస్తదా' అనే డైలాగ్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఇలా ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలనూ పెంచేశారు.

    షూటింగ్ బ్యాగ్‌డ్రాప్‌లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమే 'గుడ్ లక్ సఖి'. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త పాయింట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని నగేష్ కుకునూర్ అన్ని వర్గాల వాళ్లకు చేరువయ్యేలా రూపొందించారట. ఇక, ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీన్ని దిల్‌ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్యా వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇది జనవరి 28న విడుదల కాబోతుంది.

    English summary
    Tollywood Star Heroine Keerthy Suresh Now Doing Good Luck Sakhi Under Nagesh Kukunoor Direction. Now This Movie Official Trailer Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X