బాలయ్యకు నో సూపర్ స్టార్‌కు యస్.. యంగ్ హీరోయిన్ షాక్
మహానటి చిత్రంతో జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న కీర్తీ సురేష్.. ఆచి తూచి ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటోన్న కీర్తికి ఫుల్ డిమాండ్ ఉంది. మహానటి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది. దీంతో కీర్తి ఫేమ్ కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కీర్తి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.

మహానటి తరువాత దూరం..
మహానటి తరువాత తెలుగులో కీర్తి కనిపించ లేదు. విశాల్, విక్రమ్ లాంటి హీరోలతో తమిళంలో నటిస్తూ బిజీగా ఉన్న కీర్తి నేరుగా తెలుగు చిత్రాలతో పలకరించలేదు. ఎంతో మంది దర్శకులు కీర్తిని తెలుగులో నటింపజేయాలని ప్రయత్నించినా అది కుదరలేదు.

లేడీ ఓరియెంటెడ్‌తో బిజీగా..
కీర్తి ప్రస్తుతం మిస్ ఇండియా, పెంగ్విన్ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బిజీగా ఉంది. ఇవన్నీ కూడా బహు భాషా చిత్రాలే కావడం, అన్నీ ఒకే సారి పట్టాలెక్కడం చూస్తుంటే కీర్తి ప్లానింగ్ ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఇవే కాకుండా మిగతా ప్రాజెక్ట్‌లను కూడా సెలెక్టివ్‌గా ఎంచుకుంటోంది.

తాజాగా బాలయ్య సినిమాలో అంటూ...
బాలయ్య, బోయపాటి చిత్రంలో కీర్తి సురేష్‌ను తీసుకోబోతున్నారనే టాక్ విపరీతంగా ప్రచారం అయింది. అయితే అది కేవలం రూమరేనని, ఆ చిత్రంలో కీర్తి నటించడం లేదనే వార్తలూ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీ సరసన నటించేందుకు ఓకే చెప్పేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Recommended Video
ఎంతో ఆనందంగా ఉంది..
‘ఆయనను చూసి ఆశ్చర్యపోయే స్థాయి నుంచి కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే వరకు వచ్చాను.. ఈ విషయాన్ని ప్రకటించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది.. ఇదే నా లైప్‌లో అత్యంత ముఖ్యమైన ఘట్టం.. దర్శకుడు శివ, సన్ పిక్చర్స్‌కు థ్యాంక్స్' అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











