ఈ పరిస్థితుల్లో పెళ్లా? నోరు విప్పిన కీర్తి సురేష్.. ఏమని చెప్పిందంటే!!
సోషల్ మీడియా ప్రభావం పెరిగాక రూమర్స్‌కి అంతులేకుండా ప్యూయింది. సెలబ్రిటీలు, మరీ ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి ముచ్చట్లపై పడుతున్నారు గాసిప్ రాయుళ్లు. మొన్నటిదాకా అనుష్క పెళ్లి వార్తలు హోరెత్తగా.. గత రెండు మూడు రోజులుగా అందాల తార కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించింది కీర్తి. వివరాల్లోకి పోతే..

టాలీవుడ్ టాప్ హీరోయిన్.. జాతీయ ఉత్తమ నటి 1
చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ టాప్ హీరోయిన్ లెవల్ క్రేజ్ కొట్టేసింది కీర్తిసురేష్. మహానటి సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రంలో ఆమె పాపులారిటీ రెట్టింపయింది. కోట్లాది మంది ప్రేక్షకులను ఆకర్షించిన ఈమె జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది.

ఆలోచనలో పడిన కీర్తిసురేష్ తల్లిదండ్రులు
కాగా కీర్తిసురేష్ పెళ్లి విషయమై ఆమె తల్లిదండ్రులు సురేష్, మేనక ఆలోచనలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే తమ కుమార్తెకు తొందరలో పెళ్లి చేసి ఓ ఇంటి దాన్ని చేయాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారని వార్తలు షికారు చేస్తున్నాయి. అంతేకాదు బీజేపీ పార్టీలో కీలకంగా కొనసాగుతున్న ఓ వ్యాపారవేత్త కుమారుడితో ఆమె పెళ్లి ఖాయమైందని చెప్పుకుంటున్నారు.
Recommended Video

అతిత్వరలో కీర్తి సురేష్ పెళ్లి.. హీరోయిన్ రియాక్షన్
తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలకు కీర్తి సురేష్ కూడా సానుకూలంగా స్పందించడంతో అతిత్వరలో కీర్తి సురేష్ పెళ్లి జరగనుందని ప్రముఖ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కీర్తి సురేష్ దృష్టికి రావడంతో ఆమె వెంటనే స్పందించింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పేసింది.

ఆ మాటచెప్పి ఫుల్‌స్టాప్ పెట్టిన కీర్తి సురేష్
మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ దయచేసి ఇలాంటి వదంతులను వ్యాపింప చేయవద్దని కీర్తి సురేష్ కోరింది. మరో ఏడాది సినిమాలతోనే బిజీగా ఉంటానని, వెచ్చే ఏడాది వరకు కాల్‌షీట్స్ ఇచ్చానని, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లెలా చేసుకుంటానని ప్రశ్నించింది కీర్తి సురేష్. దీంతో ఆమె పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది.


Click it and Unblock the Notifications











