twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువ హీరోతో లిప్ లాక్.. ఆ ఒక్క కారణంతో బాక్సాఫీస్ కథను రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్!

    |

    మహానటి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్. ఆ ఒక్క సినిమా ద్వారా కెరీర్ కి సరిపోయేంత క్రేజ్ అందుకున్న ఈ జూనియర్ సావిత్రి కొన్ని విషయాల్లో సీనియర్ సావిత్రిని గుర్తు చేస్తోంది. చాలా వరకు సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇక ఇటీవల రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉందని ఒక బాక్సాఫీస్ కథకు నో చెప్పేసిందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

     నేటితరం సావిత్రి..

    నేటితరం సావిత్రి..

    నిజానికి కీర్తి సురేష్ కెరీర్ మొదటి నుంచి చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. గ్లామర్ అనే పదాన్ని దగ్గరికి కూడా రానివ్వడం లేదు. వీలైనంత వరకు లిమిట్స్ లోనే ఉంటుంది. సాధారణంగా గ్లామర్ డోస్ పెంచకపోతే సినిమా అవకాశాలు తగ్గుతాయి అంటారు. అయినప్పటికీ పరవలేదని అంటోంది. పాత్రకు మరీ అవసరం అయితే గాని గ్లామర్ టచ్ ఇవ్వడం లేదు.

    లిప్ లాక్ అనగానే..

    లిప్ లాక్ అనగానే..

    ఇప్పటివరకు కీర్తి సురేష్ హీరోలతో రొమాంటిక్ సన్నివేశాల్లో లిప్ లాక్ సీన్స్ లో నటించింది లేదు. ఆ మధ్య ఒక తమిళ్ సినిమా కోసం అమ్మడు లిప్ లాక్ సీన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వచ్చినప్పటికీ అవి రూమర్స్ అని తెలిపోయాయి. ఆ తరువాత చాలా ఇంటర్వ్యూలలో కూడా అమ్మడు లిప్ లాక్ సీన్స్ ఉంటాయి అనగానే మొదట్లోనే నో చెప్పేసేదట.

    నితిన్ సినిమా కూడా రిజెక్ట్..

    నితిన్ సినిమా కూడా రిజెక్ట్..

    ఇక ఇటీవల అందాదున్ రిమేక్ కోసం కీర్తిని సంప్రదించగా మొదట చేయడానిక్ ఇంట్రెస్ట్ చూపించిన ఈ బ్యూటీ ఆ సినిమాలో కూడా లిప్ లాక్ సీన్ తప్పనిసరి అని చెప్పడంతో రిజెక్ట్ చేసిందట. బాలీవుడ్ లో బెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అందాదున్ తెలుగులో రీమేక్ అవుతోంది అనగానే చాలా మంది హీరోయిన్స్ ఆ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ మాత్రం రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Rana Daggubati And Venkatesh To Act In An Multistarer!
    మరో హీరోయిన్ కూడా..

    మరో హీరోయిన్ కూడా..

    అందాదున్ కథలో కాస్త హోమ్లీగా ఉండే హీరోయిన్ కావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. కీర్తి సురేష్ నో చెప్పడంతో గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ని కూడా సంప్రదించారట. కానీ ఆ బ్యూటీ కూడా లిప్ లాక్ అనగానే నో చెప్పేసిందట. దీంతో నితిన్ గ్యాంగ్ మరో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తోంది. మరి ఈ బాక్సాఫీస్ కథలో ఎవరు నటిస్తారో తెలియాలి అంటే మరికొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    Young girl keerthy suresh made an impressive hit in Tollywood with mahanati . She is currently playing the female lead opposite nithiin upcoming movie. And if the latest buzz is anything to by, Priyanka will be paired opposite Nithiin very soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X