Just In
- 32 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 56 min ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 1 hr ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
Don't Miss!
- Sports
IPL 2021: చెన్నై జట్టులోకి రాబిన్ ఊతప్ప.. మీరు మారరంటూ ఫ్యాన్స్ ఫైర్!
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కీర్తి సురేష్ దగ్గర అలాంటి వేషాలు వేస్తే ఇలానే ఉంటుంది.. దర్శకుడిని పరిగెత్తించి కొట్టిన మహానటి, హీరోను కూడా
మహానటి సినిమాతో ఒక్కసారిగా కెరీర్ కీ సరిపోయేంత గుర్తింపు దక్కించుకుంది కీర్తి సురేష్. ఆమె భవిష్యత్తులో మరో బయోపిక్ చేసినా కూడా ఈ స్థాయిలో గౌరవం దక్కదేమో.. సావిత్రిని నేటితరానికి కూడా గుర్తు చేసిన ఈ బ్యూటీ నిజానికి మహానటి హావభావాలకు కాస్త దగ్గరగానే ఉంటుంది. కేవలం అందంలోనే కాకుండా అల్లరి చేయడంలో కూడా మహానటిని గుర్తు చేస్తోంది. ఇక కోపం వస్తే కూడా ఆమెను ఆపడం కష్టమే. ఇటీవల దర్శకుడిని పరిగెత్తించి మరి కొట్టేసింది.

రివేంజ్ తీర్చుకుంటున్న కీర్తి సురేష్
కీర్తి సురేష్ నటిస్తున్న రంగ్ దే సినిమా ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే సినిమా లొకేషన్స్ లో వారు ఎంత సరదాగా ఉన్నారో సోషల్ మీడియాపై ఒక లుక్కేస్తే చాలా ఈజీగా అర్ధమవుతోంది. ఎవరైనా తనపై ట్రోలింగ్ చేస్తే కౌంటర్లు ఇవ్వడం ఈ బ్యూటీకి అలవాటే. రంగ్ దే హీరో, దర్శకుడు చేసిన పనికి అమ్మడు మళ్ళీ తన రివెంజ్ తీర్చుకుంటోంది.

చెమటలు పట్టేలా పని చేస్తుంటే..
రంగ్ దే షూటింగ్ తుది షెడ్యూల్ ఆల్ మోస్ట్ ఎండ్ అయ్యింది. ఇక అప్పుడప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు ఒకరినొకరు ఆటపట్టిస్తున్నారు. ఇటీవల కీర్తి సురేష్ లొకేషన్స్ లోనే చేయిర్ లో కూర్చొని ఒక కునుకు తియ్యగా నితిన్ అందుకు సంబంధించిన ఫొటోను వైరల్ అయ్యేలా చేశాడు. మేము చెమటలు పట్టేలా పని చేసుకుంటూ ఉంటే ఆమె మాత్రం ఎలా పడుకుందో చూడండి అంటూ నీతిన్ కామెంట్ చేశాడు.
పరిగెత్తించి మరి కొట్టేసింది
ఇక నితిన్ వెనుక డైరెక్టర్ వెంకీ అట్లూరి హస్తం కూడా ఉందని తెలుసుకున్న కీర్తి సురేష్ తన కోపాన్ని తీర్చుకుంటోంది. తప్పకుండా నా పగ తీర్చుకుంటానని ముందే చెప్పిన అమ్మడు డైరెక్టర్ వెంకీని పరిగెత్తించి మరి కొట్టేసింది. ఎంత బ్రతిమాలినా కూడా నవ్వుకుంటూనే కీర్తి అతన్ని కొట్టేసింది. ఒకటి డౌన్ మరొకటి మిగిలి ఉందని సవాల్ చేసింది.

సినిమా రిలీజ్ ఎప్పుడంటే
మరొకసారి నితిన్ కు కూడా దెబ్బలు పడతాయని అమ్మడు రివెంజ్ ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి ఆ సీన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక రంగ్ దే సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి డైరెక్ట్ గా థియేటర్స్ లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. కుదిరితే ఓటీటీలో కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇంతవరకు మంచి డీల్ సెట్టయ్యే ఆఫర్ రాలేదని తెలుస్తోంది. ఇక ఈ నెలలోనే సినిమా విడుదలైపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.