అమెజాన్‌లో కీర్తి సురేష్ పెంగ్విన్ విడుదల.. టీజర్, రిలీజ్ డేట్లు ఎప్పుడంటే..
లాక్‌డౌన్ కారణంగా థియేటర్ల మూసివేతతో తమ చిత్రాలను ఓటీటీ ఫ్లాట్‌ఫాంపైన రిలీజ్ చేసేందుకు నిర్మాత, దర్శకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జ్యోతిక నటించిన పొనుమగల్ వాందల్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం కూడా అమెజాన్‌లో జూన్ 19న రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నది.
ఈ క్రమంలో ప్రమోషన్‌లో భాగంగా పెంగ్విన్ చిత్రానికి సంబంధించిన టీజన్ జూన్ 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నామని కీర్తి సురేష్ వెల్లడించింది. టీజర్ రిలీజ్‌తో సినిమా సెలబ్రేషన్స్ ఉత్సాహంగా మొదలు కాబోతున్నాయి. టీజర్‌ను కోసం వేచి చూడండి అంటూ కీర్తీ సురేష్ ఓ ఫోటోతోపాటు ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు.

గాయాలతో కూడిన కీర్తీ సురేష్ లుక్ ఏదో మిస్టరీ, థ్రిల్లర్ సినిమా అనే ఫీలింగ్‌ను క్రియేట్ చేయడమే కాకుండా ఆసక్తిని కూడా రేపింది. అంతేకాకుండా సూపర్ నేచురల్ ఎలిమింట్స్‌తో సినిమా రూపొందిందనే ఫీలింగ్ కలిగింది. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ గర్బిణిగా నటిస్తున్నది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పెంగ్విన్ చిత్రం రిలీజ్ అవుతున్నది.
సాంకేతిక నిపుణులు
దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
నిర్మాత: దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్
సంగీతం: సంతోష్ నారాయన్
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఫళని
ఎడిటర్: అనిల్ క్రిష్
బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: జూన్ 19,2020


Click it and Unblock the Notifications











