Keerthy Suresh: బాలీవుడ్ లో మహానటికి ఘోర అవమానం..

Keerthi Suresh: ఎవరికైనా లైఫ్ లో ఎదగాలని ఉంటుంది. అదే సినిమా ఫిల్డ్ అయితే.. టాలీవుడ్ లో రాణించిన వారికి బాలీవుడ్ .. బాలీవుడ్ లో సక్సెస్ అయినా వారికి హాలీవుడ్ లో రాణించాలని భావించడం సహజం. అలా చాలామంది హీరోయిన్స్.. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుండి బాలీవుడ్లో అడుగుపెట్టారు. అందులో త్రిష, కాజల్, శ్రియ, తమన్నా, పూజా హెగ్డే వంటి తారలు బాలీవుడ్ లో రాణిస్తూ ఉన్నారు. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఓ అమ్మడు బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అయితే ఆశించిన ఫలితం అందకపోగా ఘోర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంతకీ ఆ అమ్మడు ఎవరు? అసలు ఏం జరిగింది?

ఆ నటి ఎవరో కాదు మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. మలయాళ అమ్మాయి అయినా తెలుగులో సినిమాలలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందం అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులో మహానటిగా నిలిచిపోయింది . వాస్తవానికి కీర్తి సురేష్ బాలనటిగా తన కెరీర్ ప్రారంభించింది 2000 లో మలయాళ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించి బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Keerthy Suresh Was Humiliated In Bollywood Her Angry Video Viral

ఇక 'గీతాంజలి' అనే మలయాళ సినిమా తో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగింది. ఈ తరుణంలోనే తెలుగు సినిమాలలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇలా 'నేను శైలజ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మలయాళ కుట్టి. ఆ తర్వాత నాని, పవన్ కళ్యాణ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని అందుకుంది.

ఇక అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహానటి' సినిమాలో కీర్తి సురేష్ సావిత్రిగా నటించి మెప్పించింది. ఈ సినిమా కీర్తి సురేష్ సినీ ప్రస్థానంలో ఓ మైల్ స్టోన్ లాంటిది. ఈ సినిమాలో నటనకు ఆమెకు ఉత్తమ నటిగా 'జాతీయ అవార్డు' కూడా అందుకుంది. ఇలా ఎన్నో సినిమాలలో నటించి కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా సౌత్ ఇండియా ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బాలీవుడ్ పై కన్నేసింది.

Keerthy Suresh Was Humiliated In Bollywood Her Angry Video Viral

అలా 'బేబీ జాన్' అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటించగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ కాలిస్ ఈ సినిమాను తెరకెక్కించారు ఈ సినిమాలో వామిక గబ్బ, జాకీ షరాఫ్ వంటి స్టార్ హీరోలు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలిరోజే ప్లాపు టాక్ ను సొంతం చేసుకుంది. ఎన్నో ఆశలతో బాలీవుడ్లో అడుగుపెట్టిన కీర్తి సురేష్ ఆశలన్నీ అడియాశలయ్యాయి.

అంతేకాదు బాలీవుడ్ లో కీర్తి సురేష్ కు ఘోర అవమానం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అవమానపడింది. బాలీవుడ్ లోని రిపోర్టర్లు కీర్తి సురేష్ కు బదులుగా కృతి అంటూ ఆమెను పిలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 'నా పేరు కృతి కాదు.. కీర్తి, కీర్తీ సురేష్' అంటూ తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. నిజంగా జాతీయ అవార్డు గ్రహీత, సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పేరు బాలీవుడ్ లో తెలియకపోవడం దారుణం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X