మెగాస్టార్ చిరంజీవి సరసన కీర్తీ సురేష్.. మహానటికి దక్కిన ఆఫర్!
ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి చిత్రంలో నటిస్తూనే మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ప్రస్తుతం సైరాకు గ్యాప్ ఇచ్చి భార్య సురేఖతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. త్వరలోనే సైరా షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
సైరా తర్వాత చిరంజీవి నటించే చిత్రం కూడా ఫైనల్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆ సినిమాలో నయనతార, అనుష్క నటిస్తున్నట్టు రూమర్లు షికారు చేస్తున్నాయి.

అయితే వాటిని పక్కన పెట్టి కీర్తీ సురేష్ పేరు తెరపైకి వచ్చింది. కీర్తీ సురేష్ పేరు పరిశీలించినట్టు, అలాగే చిత్ర యూనిట్ కూడా ఆమెకే ఓటు వేసినట్టు సమాచారం. అధికారికంగా హీరోయిన్ పేరును వెల్లడించే అవకాశం ఉంది.
ఇప్పటికే సైరాలో నయనతార నటిస్తున్నందున ఆమెను పక్కన పెట్టినట్టు సమాచారం. అయితే ఇంకా ఈ విషయంలో క్లారిటీ లేదని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











