రాంగోపాల్ వర్మకు పట్టిన గతే నాకూ పట్టేది: కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి
ఎన్నికల కోడ్ కారణంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం రిలీజ్ పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఇలాంటివి ముందే ఊహించి తన 'లక్ష్మీస్ వీరగ్రంధం' చిత్రం రిలీజ్ చేయలేదని దర్శకుడు కేతిరెడ్డి జగనదీశ్వర్ రెడ్డి అన్నారు.
కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి శుక్రవాం తిరుమలను సందర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... 'లక్మిస్ వీరగ్రంధం' ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా రిలీజ్ చేయలేదని. ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికల వేడి లేనప్పుడు, ఒక నిజాన్ని నిష్పక్షపాతంగా ప్రేక్షకులకు తెలియచేసే ఉదేశ్యమే ఈ జాప్యానికి కారణమని తెలిపారు.

ఒకవేళ ఎన్నికల వేళ చిత్రం విడుదల చేసి ఉంటే రాంగోపాల్ వర్మకు పట్టిన గతే తనకు పట్టివుండేదన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ బయోపిక్‌ను సైతం ఎన్నికల కమిషన్ ఆపివేసిందనే విషయం గుర్తు చేశారు కేతిరెడ్డి.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో "శశిలలిత'' అనే చిత్రం తీయబోతున్నట్లు వెల్లడించిన ఆయన ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు.

ఈ చిత్ర కథ జయలలిత జీవితంలోని యదార్ధ సంఘటనలను ప్రజల ముందు ఉంచబోతున్నట్లు తెలిపారు. ఇందులో జయలలిత బాల్యం, సినీజీవితం, శోభన్ బాబు జయలలిత మధ్య ప్రేమ, రాజకీయ జీవితంతో పాటు 75 రోజులు హాస్పిటల్ లో జరిగిన వాస్తవ సంఘటనలు చూపించబోతున్నట్లు తెలిపారు. జయలలిత పాత్ర కోసం కాజోల్ దేవగన్, శశికళ పాత్రకు ఆమల పాల్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications