ఎన్టీఆర్ సినిమాలో అల్లు అర్జున్ గర్ల్ ఫ్రెండ్.. రొమాంటిక్ డోస్ పెంచేందుకేనా!
బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా.. అద్భుతమైన టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నందమూరి చిన్నోడు జూనియర్ ఎన్టీఆర్. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ టాలెంటెడ్ హీరో.. కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు.
RRR పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాల్లో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తనకు 'అరవింద సమేత' వంటి సూపర్ హిట్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. హారిక హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అన్న టైటిల్ పరిశీలనలో ఉంది. ఇది పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కబోతుందని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా, ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం... ఈ మూవీలో ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మను హీరోయిన్‌గా తీసుకునే అవకాశాలు ఉన్నాయట.
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటిస్తున్న 'రొమాంటిక్'లో హీరోయిన్‌గా చేస్తోంది కేతికా. దీనితో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 'అల్లుడు అదుర్స్'లో స్పెషల్ నెంబర్ చేస్తోంది. అలాగే, ఈ మధ్య వచ్చిన 'ఆహా' యాడ్‌లో అల్లు అర్జున్ ప్రియురాలిగా నటించింది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఇన్ని ఆఫర్లు పట్టేస్తుండడంతో కేతిక టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











