పవన్ కల్యాణ్ సినిమాలో కేతిక శర్మ: హీరోయినే కానీ.. అతడి కోసం కాదట!

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో దూసుకపోతూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది షూటింగ్ పూర్తి చేసుకోకముందే హరీశ్ శంకర్‌తో 'ఉస్తాద్ భగత్‌సింగ్', సుజిత్ దర్శకత్వంలో OG సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించాడు. వీటితో పాటు సురేందర్ రెడ్డితోనూ ఓ ప్రాజెక్టును చేయబోతున్నాడు. ఇలా ఎన్నో సినిమాలతో ఫ్యాన్స్‌ను పలకరించబోతున్నాడు.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇటీవలే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే.. తమిళంలో రూపొంది ZEE5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన 'వినోదయ సీతమ్'. ఈ సినిమాను పవర్ స్టార్ రీమేక్ చేయబోతున్నాడు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించబోతున్నట్లు కూడా ఇప్పటికే న్యూస్ లీకైంది. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది.

Ketika Sharma Fix For Pawan Kalyan and Sai Dharam Tej Movie

'వినోదయ సీతమ్' రీమేక్‌లో నటించే మిగిలిన నటీనటుల గురించి ఇప్పటి వరకూ ఎలాంటి వార్తలు రాలేదు. ఈ నేపథ్యంలో ఇందులో హాట్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అయితే, ఈ సినిమాలో ఆమె పవన్ కల్యాణ్‌కు కాకుండా సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా నటింబోతుందని కూడా తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక, ఈ మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం ఫిబ్రవరి 14న జరగబోతుందట. ఆ వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టబోతున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో టాక్ వినిపిస్తోంది.

పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటించబోయే ఈ సినిమా అతి తక్కువ రోజుల్లోనే పూర్తి అయ్యేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. అందులోనూ పవర్ స్టార్‌కు సంబంధించిన పార్ట్ ముందుగానే కంప్లీట్ చేయనున్నారని కూడా అంటున్నారు. మొత్తానికి ఈ సినిమాపై బజ్ అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X