రామ్ సినిమాలో రొమాంటిక్ హీరోయిన్: ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే బంపర్ ఆఫర్

ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఈ ఉత్సాహంతోనే మరిన్ని సినిమాలు చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ యంగ్ హీరో కోలీవుడ్ డైరెక్టర్ లింగు సామీతో ఓ సినిమాను మొదలు పెట్టేశాడు. చాలా రోజుల క్రితమే దీన్ని అనౌన్స్ చేసినా.. ఆ తర్వాత కోవిడ్ సెకెండ్ వేవ్ రావడంతో షూటింగ్‌ను మాత్రం మొదలు పెట్టలేదు. దీంతో చాలా రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన రెడ్యూలర్ షూటింగ్‌ను యూనిట్ ఆరంభించేసింది.

తెలుగు, తమిళ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వీలైనంత త్వరగా ఈ ఫిల్మ్ చిత్రీకరణను పూర్తి చేయాలని యూనిట్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా పూర్తైంది. త్వరలోనే మూడో దాన్ని కూడా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫారెన్ వెళ్లి అక్కడ కొన్ని పాటలను షూట్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.

Ketika Sharma Key Role in Ram Pothineni - Lingusamy Movie

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఇందులో నటించబోతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే కన్నడ భామ అక్షర గౌడను తీసుకున్నారని కూడా చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఆమె నటించడం లేదట. అంతేకాదు, ఇందులో పూరీ ఆకాశ్ 'రొమాంటిక్' మూవీలో హీరోయిన్‌గా నటిస్తోన్న కేతిక శర్మను తీసుకున్నారని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఇక, ఆమె పాత్రకు ఇందులో ఎంతో ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కోసం సన్నద్ధం అవుతోన్న సమయంలో హీరో రామ్ పోతినేని గాయ పడ్డాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ ఫొటోను కూడా వదిలింది. అదే సమయంలో రామ్‌కు కొన్ని వారాల విశ్రాంతి అవసరం అని చిత్ర యూనిట్ చెప్పింది. అయినప్పటికీ సినిమా షూటింగ్ ఆపకుండా యూనిట్ తగిన ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగానే హీరో పాత్ర లేని సన్నివేశాలను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు దర్శకుడు లింగు సామీ. ఈ నేపథ్యంలోనే తాజాగా సెకెండ్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నారు.

పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ భారీ సినిమాలో రామ్ పోతినేని డుయల్ రోల్ చేస్తున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అందులో ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర కూడా ఉందని అంటున్నారు. ఇఇందులో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అలాగే, సీనియర్ నటి నదియా కూడా ఇందులో కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X