శేఖర్ మాస్టర్ శృంగార భంగిమలపై కేతిక శర్మ హాట్ కామెంట్.. ఆడమన్నట్లు ఆడటమే అంటూ
మూడు గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్‌లో కూర్చోబెట్టడం అంత తేలికకాదు.. ఎన్నో అంశాలు సినిమా హిట్ కావడానికి దోహదం చేస్తాయి. ప్రేక్షకుల నాడిని పసిగట్టిన వారే ఖచ్చితంగా ఇందులో విజయం సాధిస్తారు. కమర్షియల్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ కావడానికి ఐటెం సాంగ్స్ కీలకపాత్రలు పోషిస్తున్నాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో హిట్ అయిన ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ బాగా వర్క్ అయ్యాయి. దీంతో కొందరు దర్శకులు కూడా ఐటెం సాంగ్స్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అయితే వీటిలో అభ్యంతర స్టెప్స్ ఉండటంతో దర్శక నిర్మాతలపై సాంప్రదాయవాదుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

మిస్టర్ బచ్చన్‌లో భాగ్యశ్రీతో అలాంటి స్టెప్పులు
ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమాలలోని పలు ఐటెం సాంగ్స్ కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తూ వీటిలో ఎక్కువగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన పాటలే కావడంతో ఆయనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. స్త్రీలను అసభ్యంగా చూపించడం సరికాదని శేఖర్‌పై ట్రోలింగ్ జరిగింది. తొలుత హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా వచ్చిన మిస్టర్ బచ్చన్‌లో ఓ పాటలో హీరోయిన్ డ్రెస్‌కు వెనుక వైపు ఉన్న జేబులలో రవితేజ చేతులు దూర్చి ఆమె పిరుదులపై డప్పు కొడతాడు.
వివాదాస్పదమైన దబిడి దిబిడి సాంగ్
ఇలాంటి స్టెప్స్‌ను కంపోజ్ చేసినందుకు గాను శేఖర్‌పై సాంప్రదాయవాదులు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకే సుకుమార్- అల్లు అర్జున్‌ల బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2లోని పీలింగ్స్ సాంగ్‌లో బన్నీ.. రష్మిక నడుము లోపలి వరకు చేయి పెట్టి చేసే స్టెప్ వైరల్ అయ్యింది. దాంతో మరోసారి శేఖర్ మాస్టర్ అడ్డంగా దొరికిపోయారు. అనంతరం బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌లోని దబిడి దిబిడి సాంగ్ వివాదం ఏకంగా జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ పాటలో హీరోయిన్ ఊర్వశి రౌటేలా నడుము, పిరుదులపై బాలయ్య తాకేలా స్టెప్స్ ఉండటంతో మరోసారి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి వివాదాస్పదమైంది. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు ఊర్వశి రౌటేలా స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
మహిళా కమీషన్ వరకు వివాదం
గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన నితిన్ - శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన రాబిన్‌హుడ్ సినిమాలోని స్పెషల్ సాంగ్‌పైనా వివాదం నడిచింది. ఈ సినిమాకు కూడా కొరియోగ్రాఫర్ శేఖరే కావడం గమనార్హం. హీరోయిన్ కేతికా శర్మ చేసిన అది ధా సర్‌ప్రైజు సాంగ్‌లో స్కర్ట్ పైకెత్తి చేసే స్టెప్ కాంట్రవర్సీకి కారణమైంది. ఏకంగా తెలంగాణ మహిళా సంఘం వరకు విషయం వెళ్లడంతో సినిమాలో ఈ పాట కనిపించకుండా మేకర్స్ చర్యలు తీసుకున్నారు.
దర్శకులు చెప్పినట్లు చేయాల్సిందే
తాజాగా ఈ పాటపై హీరోయిన్ కేతిక శర్మ స్పందించారు. సెట్స్‌లో దర్శకులు ఏం చెబితే అది చేయడమే తన పని అన్న కేతిక.. ఈ పాటలోని కొన్ని మూవ్‌మెంట్స్‌పై వివాదం జరిగిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్ధితులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటానని కేతిక హామీ ఇచ్చారు. తద్వారా తాను నిమిత్తమాత్రురాలినని, ఏం చేసినా అది కొరియోగ్రాఫర్, దర్శకుడిదేనని తెలివిగా తప్పించుకున్నారు కేతిక. మరి దీనిపై శేఖర్ మాస్టర్, వెంకీ కుడుముల ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











