బన్నీ-త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్ ఫైనల్ అయింది, ఎవరంటే?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ ముచ్చటగా మూడో సినిమా మొదలైన సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్లో 19వ చిత్రంగా రూపొందుతుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్. గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సమాచారం ప్రకారం సెకండ్ హీరోయిన్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఆకాష్ పూరితో కలిసి 'రొమాంటిక్' చిత్రంలో నటిస్తున్న కేతిక శర్మను ఎంపిక చేశారట.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అవ్వడానికి కొంత గ్యాప్ ఉండటంతో బన్నీ తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెకేషన్ వెళ్లారు. సెకండ్ షెడ్యూల్‌లో కేతిక శర్మ జాయిన్ అవుతుందట.
'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాల విజయాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ లాంటి బడా ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయిన మూవీ కావడంతో భారీ స్కేల్‌లో నిర్మిస్తున్నారు.

అల్లు అర్జున్ గత చిత్రం 'నా పేరు సూర్య' విడుదలై దాదాపు సంవత్సరం అయింది. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం అందుకోక పోవడంతో కథల ఎంపిక, దర్శకుడి విషయంలో బన్నీ ఆలోచనలో పడ్డాడు. త్రివిక్రమ్ కథతో కన్విన్స్ అవ్వడంతో ఈ మూవీ సెట్స్ మీదకు వచ్చింది.
అల్లు అర్జున్, పూజా హెగ్డేతో పాటు ఇతర ప్రధాన పాత్రలలో టబు, సత్యరాజ్, బోమన్ ఇరానీ, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ,రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రత్యేక పాత్రలో సుశాంత్ నటిస్తున్నాడు. డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటింగ్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











