BRO Pre Release Event సుప్రీం హీరో మాత్రమే కాదు.. సాయిధరమ్ తేజ్ హార్ట్ కూడా సుప్రీం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్రో (BRO The Avatar) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక అంగరంగ వైభవంగా జరుగుతున్నది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక సినీతారలతో జిగేల్ మనిపించింది. ఈ వేడుకకు కేతిక శెట్టి, ఊర్వశి రటేలా, ప్రియా ప్రకాశ్ వారియర్, యువలక్ష్మి, ఎస్ థమన్, టీజీ విశ్వ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఇంకా నిర్మాతలు ఏఎం రత్నం, బీవీఎస్ఎన్ ప్రసాద్, నిమ్మకాయల ప్రసాద్ హాజరయ్యారు. ఈ వేడుకలో కేతిక శర్మ, ఊర్వశి రౌటేలా మాట్లాడుతూ..

అందరికి నమస్కారం. ఈ వేడుకలో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో హాట్‌గా ఉన్నారు. మీ అందరికి ఆల్ ది బెస్ట్. విశ్వ ప్రసాద్ గారికి, వివేక్ కూచిభోట్లకు థ్యాంక్స్. ఇలాంటి అద్బుతమైన సినిమాను అందించినందుకు సముద్రఖనికి ధన్యావాదాలు. మంచి మ్యూజిక్ అందించిన తమన్‌కు థ్యాంక్స్. ఈ సినిమాకు స్టైలింగ్ అందించిన నీతా లుల్లాకు ధన్యవాదాలు అని ఊర్వశీ రౌటేలా అన్నారు.

Ketika Sharma, Uravashi Rautela speech at BRO Pre Release Event

ఇవాళ ఇక్కడ పవర్ హౌస్‌లా ఉంది. ఎందుకంటే పవర్ స్టార్ సినిమా కాబట్టి. బ్రో సినిమాలో ఆఫర్ రావడం చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. పవన్ కల్యాణ్ ఔరా గొప్పగా ఉంది. ఆయన గురించి తెలియడమే కానీ.. ప్రత్యక్షంగా చూడలేదు. సెట్‌లో చూసిన తర్వాత స్పూర్తి కలిగింది

సాయిధరమ్ తేజ్‌ను అందరూ సుప్రీం హీరో అంటారు. కానీ నీ హృదయం కూడా సుప్రీం లాంటిందే. నీతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది అని కేతిక శర్మ అన్నారు.

వైష్ణవ్ తేజ్ మూడు సినిమాలే. కాబట్టి ఇంకా ఇండస్ట్రీలో బేబీ లాంటి వాడు. సాయిధరమ్ తేజ్ సీనియర్. వారిద్దరికి పోల్చడం కుదరదు. సాయిధరమ్ తేజ్ టైమింగ్ బాగుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్, కూచిబోట్ల వివేక్‌కు ధన్యవాదాలు అని కేతిక అన్నారు.

Ketika Sharma, Uravashi Rautela speech at BRO Pre Release Event

మా సినిమాల ఈవెంట్లకు వచ్చి పవన్ కల్యాణ్ ప్రమోట్ చేయడం జరిగేది. కానీ ఆయన సినిమాలోనే నేను నటించడం హ్యాపీగా ఉంది. నేను పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. బ్రో సినిమాలో అవకాశం వచ్చింది. సాయిధరమ్ తేజ్ క్యూట్ అబ్బాయి. ఈ సినిమాలో సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని అల్లరి అల్లరిగా, చిలిపిగా చెప్పాం. మీ అందరికి నచ్చుతుంది. మేము మీ మాదిరిగానే సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అని నటి రేవతి అన్నారు.

టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అభిమానులందరికీ, ఇక్కడకు వచ్చిన మిత్రులందరికి ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన అందరికి అభినందనలు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న పవన్ కల్యాణ్.. తన అకౌంట్‌లో డబ్బు ఉంచుకోకుండా ప్రజలకు సహాయం చేస్తున్నాడు. హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, తమన్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా తీసిన నా కజిన్ టీజీ విశ్వ ప్రసాద్‌కు నా అభినందనలు. ఈ సినిమా విజయవంతం కావాలని విషెస్ తెలియజేస్తున్నాను అని టీజీ వెంకటేష్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X