KGF2కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం.. మాంచెస్టర్ ఫుట్‌బాల్ జట్టులో మూవీ పేరు
ప్రపంచవ్యాప్తంగా KGF: Chapter 2 ప్రేక్షకుల నీరాజనం అందుకొంటూ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనాలు సృష్టిస్తున్నది. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి భారీగా స్పందన వ్యక్తమవుతున్నది. ప్రతీ రోజు సరికొత్త రికార్డుతో ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే బ్రిటన్‌లో కేజీఎఫ్2 మూవీకి అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్‌లోని ప్రఖ్యాత ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ సిటీ క్లబ్ ఈ సినిమా పేరును తమ జట్టులోని ముగ్గురి ఆటగాళ్లకు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకొన్నది.
మాంచెస్టర్ జట్టులోని కెవిన్, గుండో, ఫొడేన్ ఆటగాళ్ల పేర్లలోని మొదటి అక్షరాన్ని తీసుకొని కేజీఎఫ్ ప్లేయర్లుగా మార్చుకొన్నది. మా జట్టులో కూడా యష్ లాంటి కేజీఎఫ్ ఆటగాళ్లుగా ఉన్నారు అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

మాంచెస్టర్ సిటీ జట్టు షేర్ చేసిన పోస్టర్‌ను కేజీఎఫ్2 హిందీ వెర్షన్ డిస్టిబ్యూటర్, బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకొని ఓ స్టోరిని షేర్ చేశాడు. ఎప్పుడైతే మీ జట్టు.. మా సినిమా కలిసిందంటే.. ఆ సినిమాను అద్భుతమైన వండర్‌గా పేర్కొన్నాలి. మా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫీవర్ క్రియేట్ చేసిందని చెప్పడానికి ఇంతకంటే రుజువు ఏముంటుంది అని ఫర్హాన్ అఖ్తర్ ఎమోషనల్ అయ్యాడు.
KGF Chapter 2 సినిమా విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషలో ఏప్రిల్ 14వ తేదీన రిలీజైంది. విడుదలైన తొలి ఆట నుంచే బాక్సాఫీస్ చరిత్రను తిరగరాయడం మొదలుపెట్టింది. కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకుపైగానే వసూళ్లను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











