twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగం ఫేం జీవా ‘కీ’ రిలీజ్ డేట్ ఖరారు: టెక్నాలజీ దారుణాలే ప్రధాన ఇతివృత్తంగా..

    |

    రంగం మూవీ ఫేం జీవా హీరోగా.. నిక్కి గల్రాని, అనైక సోటి హీరోయిన్లుగా రూపొందిన 'కీ' అనే తమిళ చిత్రం తెలుగు అనువాదం అదే పేరుతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కలీస్ దర్శకత్వం వహిస్తున్నారు. మే 11న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకే సారి ఈ చిత్రం విడుదల కాబోతోంది.

    టెక్నాలజీ వాడకం ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో దాని ఉప‌యోగం ఎంత ఉంటుందో, న‌ష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కంప్యూట‌ర్‌ను హ్యాక్ చేసి ఎదుటివారిని బెదిరిస్తుంటారు. ఆ న‌ష్టం ఎంతంటే ఎదుటివారు ప్రాణాలు తీసుకునేంత‌గా ఉంటోంది.

    KEY Movie releasing in May 11th

    రీసెంట్ టైమ్స్‌లో బ్లూవేల్ గేమ్ వార్త‌ను మ‌నం త‌రుచూ చ‌దువుతూనే ఉన్నాం. ఈ బ్లూవేల్ గేమ్ ఆడి ఎంతో మంది యువ‌త బ‌ల‌వంతంగా త‌మ ప్రాణాల‌ను తామే తీసుకుంటున్నారు. ఇలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన బ్లూవేల్ గేమ్ కూడా ఈ సాంకేతిక‌త‌లో భాగంగానే ఉంది. బ్లూవేల్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన ఆట‌ను మ‌నం అంద‌రం ఆడుతున్నాం. అదేంటో తెలుసుకోవాలంటే మే 11వ‌ర‌కు ఆగాల్సిందే అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

    ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ఆత్మహత్యలు చేసునే వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుందని స్పష్టమవుతోంది. కొందరు టెక్నాలజీ ఉపయోగించి ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన హీరో జీవా వారి ఆట ఎలా కట్టించాడు అనేది ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.

    ఈ చిత్రంలో జీవా, నిక్కీ గల్రానీ, అనైకా సోటి, ఆర్జే బాలాజీ, రాజేంద్ర ప్రసాద్, సుహాసిని, గోవింద్ పద్మసూర్య, మనోబాలా తదితరులు నటిస్తున్నారు. తమిళంలో మైఖేల్ రాయప్పన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో కృష్ణ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్నారు.

    English summary
    Jeeva, Nikki Galrani, Anaika Soti starrer KEY Movie releasing in May 11th. "KEY" is an upcoming Indian Telugu, Tamil film, Directed by Kalees. Music by Vishal Chandrasekar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X