ఉత్కంఠ రేపుతున్న ‘కీ’ మూవీ ట్రైలర్

జీవా, నిక్కి గల్రాని, అనైక సోటి ప్రధాన పాత్రల్లో రూపొందిన 'కీ' అనే తమిళ చిత్రం తెలుగు అనువాదనం అదే పేరుతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కలీస్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ ఉత్కంఠ రేపే విధంగా ఉంది. సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ఆత్మహత్యలు చేసునే వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుందని స్పష్టమవుతోంది. కొందరు టెక్నాలజీ ఉపయోగించి ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన హీరో జీవా వారి ఆట ఎలా కట్టించాడు అనేది ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.

2017లో విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.

Key Movie Telugu Trailer released

ఈ చిత్రంలో జీవా, నిక్కీ గల్రానీ, అనైకా సోటి, ఆర్జే బాలాజీ, రాజేంద్ర ప్రసాద్, సుహాసిని, గోవింద్ పద్మసూర్య, మనోబాలా తదితరులు నటిస్తున్నారు. తమిళంలో మైఖేల్ రాయప్పన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో కృష్ణ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X