బాలీవుడ్ బడా సినిమాతో పోటీ పడబోతున్న KGF 2.. ఆ ప్రభావం తప్పదు?

కరోనావైరస్ మహమ్మారి కారణంగా బాలీవుడ్ ఖాన్ లకు గట్టి దెబ్బె పడింది. ఏడాదికి ఎవరో ఒకరు బాక్సాఫీస్ వద్ద భారీ స్టౌయిలో విజయాన్ని అందుకుంటూ ఉండేవారు. కానీ గత ఏడాది రావాలని అనుకున్నా కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. చిన్న సినిమాలతోనే తొందరగా వచ్చి సక్సెస్ కొట్టాలని చూసిన వారికి కూడా నిరాశే ఎదురైంది. ఇక అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కూడా చాలాసార్లు వాయిదా పడింది. కరీనా కపూర్ మేయిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాల్ టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇక ఈ చిత్ర యూనిట్ ఎట్టకేలకు విడుదల తేదీపై ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. విడుదల తేదీపై ఎంతో సహనంగా ఎదురుచూస్తున్న అభిమానులకు కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

శనివారం మధ్యాహ్నం, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ సరికొత్త పోస్టర్‌తో సినిమా కొత్త విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. 2022 ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రంలో అమీర్ కరీనా మధ్య కొనసాగే కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందట. అసలైతే లాల్ సింగ్ చద్దా సినిమాను 2021 క్రిస్మస్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. జెట్ స్పీడ్ లో షూటింగ్ ను పూర్తి చేయాలని శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేశారు. అప్పట్లో విజయ్ సేతుపతిని ఒక ముఖ్యమైన పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. అతను కాదని చెప్పిన తరువాతే నాగచైతన్యను ఆ పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ఫైనల్ గా చిత్రం 2022 ప్రేమికుల రోజున థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.

Kgf 2 clash with aamir khan Laal Singh Chaddha

కొత్త పోస్టర్‌ ను కరీనా కపూర్ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్‌ లో షేర్ చేసుకకుంది. "మా న్యూ పోస్టర్ అలాగే మా కొత్త విడుదల తేదీని ఇలా షేర్ చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు. లాల్ సింగ్ చద్దా సమ్మర్ లో రావడం ఓకే కానీ అదే సమయంలో యష్ నటించిన KGF 2 కూడా విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF చాప్టర్ 2 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో పోటీ ఏ విదంగా కొనసాగుతుంది అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఇక వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ నటించిన భేదియా కూడా అదే సమయంలో రానుంది. ఈ మూడు సినిమాలు ఏప్రిల్ 14న విడుదల కానున్నాయి. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన లాల్ సింగ్ చద్దా సినిమాను అమీర్ ఖాన్, కిరణ్ రావు మరియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం హాలీవుడ్ హిట్ ఫారెస్ట్ గంప్‌కి రీమేక్ గా రానుంది. భారతదేశంలోని 100కి పైగా లొకేషన్లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X