కేజీఎఫ్‌ 2 అప్ డేట్: ఇందిరాగాంధీ పాత్రలో రవీనా టాండన్

గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని వర్గాలను ఆకట్టుకొన్నది. ఆ సినిమా సాధించిన వసూళ్లు ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేశాయి. కన్నడ చరిత్ర కలెక్షన్ల రికార్డులను కేజీఎఫ్ తిరుగరాసింది. యష్‌ను సూపర్ స్టార్‌గా చేసింది. అలాంటి చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్రను బాలీవుడ్ నటి రవీనా టాండన్ పోషిస్తున్నారనే వార్త దేశవ్యాప్తంగా మీడియాలో చర్చనీయాంశమైంది.

కేజీఎఫ్ అందించిన సక్సెస్ ఉత్సాహంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2ను జాతీయ ప్రాజెక్ట్‌గా మలిచారు. హిందీ, తమిళం, తెలుగు రంగాలకు చెందిన స్టార్లను ఈ సినిమాలో నటింపజేస్తున్నారు. ఈ చిత్రంలో రవీనా టాండన్ నటిస్తున్నారు. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరగాంధీగా కనిపించబోతున్నారు అని చిత్ర నిర్మాతలు వెల్లడించారు.

KGF 2 update: Raveena Tandon as Indira Gandhi

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కథా నేపథ్యంగా కేజీఎఫ్‌ను తెరకెక్కించారు. ఈ చిత్రం కథ 1951లో మొదలై ఈ రోజు వరకు సాగుతుంది. కోలార్ గోల్డ్ మైన్స్‌కు ఇందిరా గాంధీకి కథలో సంబంధమేమిటనే అంశం అందరిలో ఆసక్తిని రేపుతున్నది. ఈ చిత్రంలో సంజయ్ దత్, రావు రమేస్ లాంటి నటులు కీలక పాత్రలను పోషిస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X