twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు ఛానెల్‌‌‌పై కేసు.. అక్రమంగా కేజీఎఫ్ టెలికాస్ట్.. లీగల్ చర్యలకు సిద్ధం!

    |

    అత్యంత ప్రజాదరణ పొందిన కేజీఎఫ్: చాప్టర్ 1 యూనిట్ ఎదురు దెబ్బ తగిలింది. అనుమతి లేకుండా కేజీఎఫ్ చిత్రాన్ని టెలికాస్ట్ చేసిన తెలుగు టెలివిజన్ ఛానెల్‌పై కొరడా ఝలిపించేందుకు సిద్ధమవుతున్నది. తమ అనుమతి, ఒప్పందం లేకుండా సినిమాను బుల్లితెరపై ప్రసారం చేయడం చట్టవిరుద్ధమని చెబుతూ లీగల్‌గా చర్యలు తీసుకోవడానికి న్యాయ నిపుణులను సంప్రదించామని నిర్మాత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇంతకు ఈ వివాదంలో ఏం జరిగిందంటే..

    దేశవ్యాప్తంగా 225 కోట్లు

    దేశవ్యాప్తంగా 225 కోట్లు

    2018లో తెలుగు డబ్బింగ్ చిత్రంగా రిలీజైన కేజీఎఫ్: చాప్టర్ 1 చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. యష్‌కు తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ లభించింది. యష్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ విస్తరించేలా చేసింది. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ.225 కోట్లు వసూలు చేసింది.

    డిజిటల్, శాటిలైట్‌కు భారీ డిమాండ్

    డిజిటల్, శాటిలైట్‌కు భారీ డిమాండ్

    కేజీఎఫ్1 సక్సెస్‌తో నిర్మాతలు సీక్వెల్‌ను వెంటనే ప్రారంభించారు. కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం మరో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్నది. బాలీవుడ్ తారలు సంజయ్ దత్, రవీనా టాండన్, తెలుగు నటుడు రావు రమేష్ నటిస్తున్నారు. దీంతో కేజీఎఫ్‌పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో కేజీఎఫ్ శాటిలైట్, డిజిటల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో అక్రమంగా కేజీఎఫ్‌ను లోకల్ ఛానెల్ ప్రసారం చేయడం వివాదంగా మారింది.

    నష్టపరిహారం దావా వేస్తాం

    నష్టపరిహారం దావా వేస్తాం

    కేజీఎఫ్1 ప్రసార వివాదంపై ఎగ్జిక్యూటివ్ నిర్మాత కార్తీక్ గౌడ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. చట్ట విరుద్ధంగా, నిబంధనలు ఉల్లంఘించిన మా సినిమాను ఛానెల్‌లో ప్రసారం చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయి. ఎవ్రీ అనే లోకల్ తెలుగు ఛానెల్‌లో అక్రమంగా ప్రసారం చేశారు. వారిపై చట్టపరంగా నష్టపరిహారం దావా వేస్తున్నాం అని చెెప్పారు. ఓ వైపు శాటిలైట్ హక్కుల విషయం కొలిక్కి వస్తుందనే విషయం తెలిసి కూడా చానెల్ ప్రసారం చేయడం దారుణం. మా వద్ద ఆ ఛానెల్‌లో ప్రసారమైనట్టు స్క్రీన్ షాట్స్, వీడియోలు ఉన్నాయని తెలిపారు.

    హక్కులు ఎవరికీ ఇవ్వలేదు..

    హక్కులు ఎవరికీ ఇవ్వలేదు..

    కేజీఎఫ్ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను కూడా ఎవరికీ ఇవ్వలేదు. టెలివిజన్ ప్రీమియర్‌కు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మా నిర్మాతల నుంచి అనుమతి లేకుండా ఎవ్రీ ఛానెల్ ప్రసారం చేసింది. దీనిపై కోర్టు నుంచి లీగల్ నోటీసుల పంపుతాం అని యూనిట్ సభ్యులు వెల్లడించారు.

    దక్షిణాదిలో యదేచ్ఛగా పైరసీ

    దక్షిణాదిలో యదేచ్ఛగా పైరసీ


    దక్షిణాదిలో లోకల్ ఛానెల్‌లు ఇలా ప్రవర్తించడం రెగ్యులర్‌గా జరుగుతున్నది. ఇలాంటి చెడ్డ సంస్క‌ృతి లోకల్ చానెల్స్‌లో ఉంది.ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌పై ఈ ఛానెల్స్‌కు కనీస గౌరవం లేదు. ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడిన కొన్ని ఛానెల్స్ యజమానులను తమిళనాడులో అరెస్ట్ చేశాం. వాళ్ల ఆఫీసులను కూడా సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి.

    English summary
    KGF: Chapter 1 makers are very serious on Telugu Local TV Channel. They have telecasted the KGF movie on their Local Channel without any permission from the makers. on this note, Producers are ready to take leagal action on TV Channel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X