కె.జి.యఫ్ అఫీషియల్ అప్‌డేట్.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన కె.జి.యఫ్ సంచలనాల గురించి తెలిసిందే. వంద కోట్ల కలెక్షన్లను చూడని కన్నడ ఇండస్ట్రీలో ఏకంగా 250 కోట్ల కనక వర్షాన్ని కురిపించాడు రాకీ భాయ్. ఈ రాకీ భాయ్‌కు బాలీవుడ్ కూడా సలాం కొట్టేసింది. కేవలం డబ్బింగ్ చిత్రంతోనే అక్కడి స్టార్ హీరో రేంజ్‌లో కలెక్ట్ చేసేశాడు.
కోలార్ బంగారు గనుల్లో మాఫియా నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ రేపే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు కూడా అన్ని ఇండస్ట్రీల్లో మార్మోగిపోయింది. రాజమౌళి లాంటి దర్శకదిగ్గజమే ప్రశాంత్ పనితనాన్ని మెచ్చుకున్నాడు.

చాప్టర్2పై అంచనాలు..
మొదటి చాప్టర్‌ను బిగితో కూడిన స్క్రీన్‌ప్లేతో నడిపించిన దర్శకుడు.. రాకీ భాయ్ కథను పూర్తిగా చెప్పలేదు. కొన్ని కొన్ని సీన్లను రివీల్ చేస్తూ రెండో పార్ట్‌పై అంచనాలు కలిగేలా చేశాడు. మేకర్స్ అనుకున్నట్లుగానే కేజీఎఫ్ చాప్టర్2పై భారీ హైప్ క్రియేట్ అయింది.
భారీ ఎత్తును సీక్వెల్..
ఈ క్రేజీ మూవీలో మున్నాభాయ్ సంజయ్ దత్ ప్రధాన విలన్ అధీరాగా నటిస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన అధీరా లుక్‌కు అద్భుత స్పందన వచ్చింది. మాఫియా సామ్రాజ్యంలో ఎప్పుడూ ఒక్కడే డాన్ ఉండడు.. ఒకడ్ని మించి ఒకడు వస్తూనే ఉంటాడనేట్టుగా సంజయ్ పాత్రను తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది.
Recommended Video

ఫస్ట్ లుక్ రాబోతోంది..
ఈసారి రాకీ భాయ్ యాక్షన్ ఏ లెవల్లో ఉంటుందోనన్న అంచనాలు ఇప్పటికే అభిమానుల్ని ఊపేస్తున్నాయి. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టైటిల్ లుక్ తాజాగా రివీలైంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 21న సాయంత్రం 5:45 కి విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











