twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF 2 OTT Release: అనుకున్న డేట్ కంటే ముందే రాబోతున్న యాక్షన్ మూవీ.. ఎప్పుడంటే?

    |

    ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలలో ఒకటైన KGF 2 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా అనుకున్నట్టుగానే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి కన్నడ సినిమా స్థాయిని ఒక్కసారిగా పెంచేసింది. అంతేకాకుండా సౌత్ సినిమాల వ్యాల్యూ కూడా అమాంతంగా పెరిగిపోయింది అని చెప్పాలి. ఇక ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రాబోతోంది అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే అనుకున్న తేదీ కంటే ముందుగానే కేజిఎఫ్ చాప్టర్ 2 విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    భారీగా లాభాలు

    భారీగా లాభాలు

    ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ 2 సినిమా మొదటి భాగం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ కథకు కొనసాగింపుగా వచ్చిన సెకండ్ చాప్టర్ కూడా అంతకు మించి అనేలా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుని అద్భుతాలను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 700 కోట్ల కలెక్షన్స్ తో నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించింది.

    సరికొత్త రికార్డు

    సరికొత్త రికార్డు

    కేజిఎఫ్ చాప్టర్ 2 విజయంతో రాబోయే మరిన్ని పెద్ద సినిమాలకు ఒక ధైర్యం వచ్చింది అనే చెప్పాలి. ఒక విధంగా కేజిఎఫ్ 2 , RRR రికార్డులను కూడా భారీ స్థాయిలో బ్రేక్ చేయడం విశేషం. హిందీలో ఇప్పటికే ఈ సినిమా RRR కంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే విధంగా దూసుకుపోతోంది. అత్యధిక వేగంగా 250 కోట్ల వసూళ్లను సాధించిన తొలి సౌత్ సినిమాగా కూడా కెజిఎఫ్ 2 రికార్డు సృష్టించింది.

    కాస్త డివైడ్ టాక్

    కాస్త డివైడ్ టాక్

    కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా మొత్తానికి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఓ వర్గం ప్రేక్షకుల నుంచి మాత్రం కొంత నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. సినిమాలో ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత ఎమోషనల్ సీన్ లేవని దర్శకుడు అనవసరమైన ఎలివేషన్ లు ఇచ్చి అంచనాలను తగ్గించేశాడు అనే కామెంట్స్ కూడా వచ్చేశాయి.

    ఈ వీకెండ్ కూడా

    ఈ వీకెండ్ కూడా

    అయితే టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా హీరో యష్ స్టార్ హోదా తో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. దాదాపు అన్ని భాషల్లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ వీకెండ్లో కూడా కలెక్షన్స్ డోస్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.

     ఓటీటీ రిలీజ్?

    ఓటీటీ రిలీజ్?

    ఇక కేజిఎఫ్ చాప్టర్ 2 ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలైతే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ లో సినిమా థియేటర్లలో విడుదలైన యాభై రోజుల తర్వాత విడుదల చేయాలి అని సెట్ చేసుకున్నారు.

    ఒక వారం ముందే..

    ఒక వారం ముందే..

    ఇక ఇప్పుడు ఫైనల్ గా కేజిఎఫ్ చాప్టర్ 2ను అనుకున్న తేదీ కంటే ముందే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది సినిమాను ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మే 27వ తేదీన ఓటీటీలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంటే ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం ఒక వారం ముందు ఓటీటీలో విడుదల చేసుకునేందుకు నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

    English summary
    KGF Chapter 2 OTT Amazon prime release date update
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X