ఫలక్‌నుమా ప్యాలెస్‌లో యష్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ
కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను కూడగట్టుకొన్న యష్ తన రెండో చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు దృష్టిపెట్టారు. కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా KGF: చాఫ్టర్ 2 చిత్రాన్ని శరవేగంగా హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ లాంటి మేటి యాక్టర్లు భాగమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా మారిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
బళ్లారి ప్రాంతంలో షూటింగ్‌కు అనుమతించకపోవడం వల్ల కేజీఎఫ్ షూటింగ్‌ను హైదరాబాద్‌కు మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ప్రధాన తారాగణంపై కొన్ని కీలక, ముఖ్యమైన సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. షూటింగ్‌లో భాగంగా కేజీఎఫ్2 సినిమా షూట్‌ను ఇటీవల హైదరాబాద్‌లోని ఫలక్‌నామా ప్యాలెస్‌లో కొన్ని సీన్లను చిత్రీకరించగా.. పెద్ద ఎత్తున్న ఫ్యాన్స్ తరలివచ్చారట.

తన అభిమాన నటుడిని చూసేందుకు చాలా మంది ఫ్యాన్స్ లంచ్ కోసం టేబుల్స్ బుక్ చేసుకొని షూటింగ్‌ను ఆస్వాదించారట. దాంతో తమ సినిమాకు, యష్‌కు ఉన్న క్రేజ్‌ను చూసి దర్శకుడు ప్రశాంత్ నీల్ అవాక్కయ్యారనేది తాజా సమాచారం. టాలీవుడ్‌లో యష్‌కు ఇంత క్రేజ్ ఉంటుందని ఊహించలేదని, ఇంత మంది తరలిరావడం చాలా సంతోషం వేసిందని చిత్ర యూనిట్ పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











