రాకీ భాయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. టీజర్, ట్రైలర్ ఇప్పట్లో రావు.. ఇక అవన్నీ అప్పుడే!
ఒక్క సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తలెత్తుకునేలా చేసింది. అదే ఒక్క సినిమా ఓ హీరో స్టార్డమ్‌ను అమాంతం పెంచేసింది. నేషనల్ స్టార్‌గా మార్చేసి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది. అదే కేజీయఫ్ సినిమా. ఆ సినిమా కోలీవుడ్ సగర్వంగా తలెత్తుకుంది. ఈ సినిమాతో కన్నడ్ రాకింగ్ స్టార్ యష్ స్టామినా దేశ వ్యాప్తంగా తెలిసిందే. ఒక్క కేజీయఫ్ సినిమా యష్‌ను రాకీ భాయ్‌గా మార్చేసింది. ఈ సినిమా క్రియేట్ సెన్సేషన్ గురించి, నెలకొల్పిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే.

ప్రపంచవ్యాప్తంగా రూ250 కోట్లు..
కేజీయఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 250కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. కేవలం డబ్బింగ్ చిత్రంగా విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్‌ను దుమ్ముదులిపింది. అక్కడి స్టార్ హీరోలనే గడగడలాడించేశాడు రాకీ భాయ్. దక్షిణాది చిత్రాలు ప్యాన్ ఇండియా లెవెల్‌లో తమ సత్తా చాటుతున్న తరుణంలో కేజీయఫ్ రికార్డులు కొల్లగొట్టేసింది.

అంతకు మించి అంచనాలు..
కేజీయఫ్ దెబ్బకు చాఫ్టర్ 2పై అంచనాలు ఆకాశన్నంటాయి. వాటికి తగ్గట్టే భారీ తారాగణంతో మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అధీరా పాత్రలో సంజయ్ దత్ ను మనం చూశాం. మరికొన్ని ముఖ్య పాత్రలకు రావు రమేష్, రవీనాటాండన్ వంటివారిని తీసుకున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సగటు సినీ ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు.

కరోనా దెబ్బకు క్యాన్సిల్..
హైద్రాబాద్‌లో కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ జరుగుతూ ఉండగా కరోనా దెబ్బ కొట్టేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ విధించడంతో చిత్ర పరిశ్రమ కూడా పూర్తిగా మూతపడిపోయింది. దీన్ని అన్ని సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. అందులో భాగంగా ఛాప్టర్ 2 షూటింగ్ సైతం ఆగిపోయింది.
Recommended Video

టీజర్, ట్రైలర్స్ ఏమీ లేవు..
కరోనా కారణంగా అన్ని షెడ్యూల్స్ వాయిదా పడటంతో టీజర్, ట్రైలర్ లాంటివేమీ రావని నిర్మాత ప్రకటించాడు. టీజర్, ట్రైలర్ వంటివి రిటీజ్‌కు కొన్ని రోజుల ముందు విడుదల చేస్తామని తెలిపాడు.ఇంట్లోనే ఉండండి.. క్షేమంగా ఉండండని సూచించాడు. ఛాప్టర్ 2 అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











