కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్.. ఆసక్తిని పెంచేస్తోన్న ప్రశాంత్ నీల్
ప్రశాంత్ నీల్ యశ్ కాంబినేషన్‌లో వచ్చిన కేజీయఫ్ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కన్నడ చిత్రాలకు అంతగా గుర్తింపులేని చోట కూడా శాండిల్ వుడ్ సత్తాను చాటారు. మొత్తంగా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ వైపు దేశం మొత్తం తిరిగి చూసేలా చేశారు. ప్రశాంత్ నీల్ నుంచి కేజీయఫ్ చాప్టర్ 2 ఎప్పుడు వస్తుంది.. మళ్లీ రాకీ భాయ్ ప్రభంజనాన్ని ఎప్పుడు చూస్తామా? అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆ ఆసక్తి, అంచనాలకు తగ్గట్టుగా చాప్టర్ 2ను రెడీ చేసినట్టున్నారు. ఆలస్యమవుతూ వచ్చినా కూడా అదిరిపోయే అప్డేట్లతో అందరి దృష్టి తమ పైనే పడేలా చేసుకున్నారు. ఇక యశ్ బర్త్ డే సందర్భంగా అసలు విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అయ్యారు. రాకీ భాయ్‌గా చాప్టర్ 2లో యశ్ ఎటువంటి విన్యాసాలు చేయనున్నాడో చూపించబోతోన్నాడు. ఈ మేరకు టీజర్‌లో ఎలాంటి అంశాలు ఉండనున్నాయో హింట్ ఇచ్చాడు.

కేజీయఫ్ టైమ్స్ అంటూ ఓ దినపత్రికను రిలీజ్ చేశారు. ఇందులో రాకీ దేన్ని ఎంచుకుంటాడు? ప్రేమనా లేక అధికారాన్నా? మాట కోసం నిలబడేవాడు.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ బతుకుతుందా? జాదుగాడు తన ప్రేయసిని పొందగలడా? రీనాతన ప్రేమను తిరిగి పొందుతుందా? అంటూ రకరకాల హెడ్డింగ్‌లతో ఆసక్తిని పెంచేశారు. ఈ టీజర్‌ను జనవరి 8న ఉదయం 10 గంటల 18 నిమిషాలకు విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











