KGF Chapter 2 Trailer: తుఫాను ముందు ఉరుము.. ట్రైలర్ డేట్, టైం ప్రకటన
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో దక్షిణాది సినిమాల హవా దేశ వ్యాప్తంగా కనిపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి - రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'బాహుబలి' తర్వాత ఎన్నో సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, వాటిలో నేషనల్ రేంజ్‌లో సందడి చేసిన చిత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' ఒకటి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిలో ఇది భారీ కలెక్షన్లను రాబట్టింది.
'కేజీఎఫ్ చాప్టర్ 1' సూపర్ డూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్‌ను తీయాలని అప్పుడే డిసైడ్ అయిపోయారు. అందుకు అనుగుణంగానే 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట దీన్ని పట్టాలెక్కించేశారు. పక్కా ప్లాన్‌తో కేజీఎఫ్ మొత్తాన్ని తన వశం చేసుకున్న రాఖీ భాయ్‌కు అధీరా రూపంలో ప్రధాన ప్రత్యర్థి రావడంతో ఈ కథ ప్రారంభం అవుతుంది. వాళ్లిద్దరి మధ్య పోరాటం జరిగే తీరుతోనే సినిమా తెరకెక్కింది. ఇందులో యశ్ హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేసి చూపిస్తారని తెలుస్తోంది. ఆరంభం నుంచే ఈ చిత్రంపైన కూడా అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని మరింత భారీతనంతో తెరకెక్కించారు.

'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అయినా.. అనివార్య కారణాలతో అనుకున్న సమయానికి టాకీ పార్ట్‌ను పూర్తి చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో దీనికి గుమ్మడికాయ కొట్టేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టారు. వీటికి సంబంధించిన అన్ని రకాల వర్క్స్‌ను ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసుకున్నారు. దీంతో ఈ సినిమాను గత ఏడాదే డిసెంబర్‌లోనే విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది వీలు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని 2022, ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పింది.
'కేజీఎఫ్ చాప్టర్ 2' విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చాలా రకాల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను వదిలింది. ఇందులో 'కేజీఎఫ్ చాప్టర్ 2' ట్రైలర్‌ను మార్చి 27వ తేదీన సాయంత్రం 6.40 గంటలకు విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ 'తుఫాను ముందు ఉరుము రాబోతుంది' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇక, ఈ సినిమా టీజర్ మాదిరిగానే ట్రైలర్‌ను కూడా ఎంతో పవర్‌ఫుల్ విజువల్స్‌తో.. అంచనాలకు అనుగుణంగానే కట్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ టీజర్ నేషనల్ రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక, ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. వీళ్లతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











