KGF Chapter 2 Trailer: కేజీఎఫ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆరోజే పవర్‌ఫుల్ ట్రైలర్
కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ చిత్రాలు చాలానే వస్తుంటాయి. అయితే, అవి ఆ భాషకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ సినిమా స్థాయిని దేశ వ్యాప్తంగా చూపించుకోవాలన్న లక్ష్యంతో విడుదలైన చిత్రమే 'KGF Chapter 1' ఒకటి. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిలో ఇది భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో జాతీయ అవార్డులు కూడా సొంతం అయ్యాయి.
'KGF Chapter 1' భారీ విజయాన్ని దక్కించుకోవడంతో దీనికి సీక్వెల్‌ను కూడా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ చాలా రోజుల క్రితమే వెల్లడించింది. అందుకు అనుగుణంగానే 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట దీన్ని తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగంలో కేజీఎఫ్‌ను సొంతం చేసుకున్న రాఖీ భాయ్‌ను ఎదురించేందుకు అధీరా ఎంట్రీ ఇవ్వడంతో రెండో భాగానికి సంబంధించిన కథ మొదలయ్యేలా దీన్ని రూపొందిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య పోరాటం జరిగే తీరుతోనే సినిమా తెరకెక్కింది. ఆరంభం నుంచే ఈ చిత్రంపైన కూడా అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని ఉన్నత విలువలతో తెరకెక్కించారు.
ఇక, 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ షూటింగ్ మొదలై చాలా కాలమే అయినా.. అనివార్య కారణాలతో అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో దీన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. వీటికి సంబంధించిన అన్ని రకాల వర్క్స్ దాదాపుగా పూర్తి చేసేశారు. దీంతో ఈ సినిమాను గత ఏడాదే డిసెంబర్‌లోనే విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది వీలు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని 2022, ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది.

'కేజీఎఫ్ చాప్టర్ 2' విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను విస్తృతం చేయాలని భావించింది. అందుకు అనుగుణంగానే ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. 'కేజీఎఫ్ చాప్టర్ 2' ట్రైలర్‌ను మార్చి 8వ తేదీన విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మహా శివరాత్రి సందర్భంగా మార్చి 1న రాబోతుందని తెలుస్తోంది. టీజర్ మాదిరిగానే ట్రైలర్‌ను కూడా ఎంతో పవర్‌ఫుల్ విజువల్స్‌తో కట్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' టీజర్ నేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. వీళ్లతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











